నటి షకీలా తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. ‘‘మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో నటిగా రాణించడం కోసం నేను ఎంతలా కష్టపడ్డానో మా నాన్నకు బాగా తెలుసు. నా కష్టాలను ఆయన దగ్గరుండి చూశారు. ఓ సినిమా షూట్‌కు నాన్న నాతోపాటు సెట్‌కి వచ్చారు. షాట్‌లో భాగంగా నేను భవనంపై నుంచి కిందకు దూకాలి. డూపుల్లేకపోవడంతో నేనే దూకాల్సి వచ్చింది. అప్పుడు నా కాలు కూడా విరిగింది. అది చూసి మా నాన్నకు గుండెపోటు వచ్చింది. ఇకపై సినిమాల కోసం అలాంటి యాక్షన్ తరహా సన్నివేశాలు చేయవద్దని నాన్న చెప్పారు’’ అంటూ షకీలా కన్నీళ్లు పెట్టుకున్నారు.
షకీలా చేసిన షాట్ చూసి తండ్రికి గుండెపోటు
Related tags :