వర్జీనియాలో శనివారం నాడు ఆటా 17వ కాన్ఫరెన్స్ కమిటీ ఫ్రారంభ సమావేశం నిర్వహించారు. జూలై 1-3,2022 న జరగనున్న ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ కోసం 200 మంది వాలంటీర్లతో 80 కమిటీలను ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు భువనేష్ బూజాల తెలిపారు. కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్ జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశ్య, కాన్ఫరెన్స్ డైరెక్టర్ కె కె రెడ్డి, కో-కన్వీనర్ సాయి సుదిని, కో-ఆర్డినేటర్ రవి చల్లా, కో-డైరెక్టర్ రవి బొజ్జా, స్థానిక కోఆర్డినేటర్ శ్రావణ్ పాడూరు, ఆటా బోర్ద్ సభ్యులు న్యూజెర్సి రాష్ట్రం నుండి రవి గూడురు, శరత్ వేముల, చికాగొ నుండి చల్మ బండారు, మహెందెర్ ముస్కుల రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) అధ్యక్షురాలు సుధ కొండపు, కాన్ఫరెన్స్ కమిటీ కోఆర్డినేషన్ టీమ్ సభ్యులు హనిమి వేమిరెడ్డి, ప్రవీణ్ దాసరి, కౌశిక్ సామ, రవి చల్లా, హర్ష బారెంకబాయి, లోహిత్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు.