Agriculture

క్వింటా పత్తి ధర ₹8వేలకు పైనే. రికార్డు అంటున్న రైతులు.

క్వింటా పత్తి ధర ₹8వేలకు పైనే. రికార్డు అంటున్న రైతులు.

మార్కెట్‌లో పత్తి ధర దుమ్ము రేపుతోంది. క్వింట పత్తికి రూ.8 వేలకు పైగా పలుకుతోంది. సీజన ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో ధర లభిస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది…!!

ఈ ధర గతంలో ఎప్పుడూ లేదని, క్వింటం నాలుగైదు వేలకు మించలేదని రైతులు అంటున్నారు. ఈసారి సాగు విస్తీర్ణం తగ్గి, మార్కెట్‌కు పత్తి తక్కువగా వస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పత్తికి డిమాండ్‌ పెరిగింది. దీం తో ధర రికార్డు స్థాయిలో లభిస్తోందని వ్యాపారులు అంటున్నారు. మూడేళ్లుగా పత్తి బఫర్‌ స్టాక్‌ తగ్గడంతో పాటు, చైనా, పాకిస్తాన, బంగ్లాదేశలలో పత్తి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ నుంచి మన దేశ పత్తికి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు…!!

కొవిడ్‌ కారణంగా గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలన్నీ మూతబడ్డాయి. ఇవన్నీ క్రమక్రమంగా తెరుచుకున్నాయి. దీంతో ప్రధాన ముడిసరుకైన పత్తికి భారీగా డిమాండ్‌ పెరిగింది. బంగ్లాదేశ, చైనా, అమెరికాతో పాటు యూరోపియన మార్కెట్‌లో పత్తి అవసరాలు పెరిగాయి. ప్రపంచ దేశాల నుంచి మన దేశంలో ఉత్పత్తి అవుతున్న పత్తిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నా…!!