DailyDose

హూజూరాబాద్‌లో నోట్ల కట్టల కవర్లు. ధూళిపాళ్ల ట్రస్టుకు నోటీసులు-నేరవార్తలు

హూజూరాబాద్‌లో నోట్ల కట్టల కవర్లు. ధూళిపాళ్ల ట్రస్టుకు నోటీసులు-నేరవార్తలు

* తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 5 వ్యక్తులు సజీవ దహనం అవగా.. 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. తమిళనాడులోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంకరాపురంలోని బాణసంచా కేంద్రంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మంటల్లో ఐదుగురు సజీవదహనం అయ్యారు. మరో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్.. రెస్క్యూ ఆపరేన్ నిర్వహిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో అక్కడ పరిస్థితి భయానకంగా కనిపిస్తోంది.

* మండపేటకు చెందిన ఓ వివాహితపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మండపేట రూరల్ సిఐ శివ గణేష్, ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ లతో కలిసి రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు తూర్పుగోదావరి జిల్లా వడ్లమూరు గ్రామ ప్రాంతము నుండి “దిశ” యాప్ కు ఫోన్ రావడంతో ఫోన్ కాల్ ఆధారంగా మండపేట రూరల్ సిఐ శివ గణేష్ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని ఆ ప్రాంతమంతా పరిశీలన చేయగా అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. కాగా “దిశా” యాప్ వచ్చిన ఫోన్ నెంబర్ తో అనుసంధానమైన (కాంటాక్ట్ నెంబర్ లు)మరో కొన్ని ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగా బాధితురాలిని గుర్తించలేకపోయారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా సిఐ సమీపంలో గల అన్ని ఆస్పత్రులను తనిఖీలు చేయగా… మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నట్లు గుర్తించి వివరాలు సేకరించారు. బాధితురాలి నుండి సేకరించిన వివరాలు ప్రకారం భర్తకు దూరంగా ఉంటున్న వివాహిత తన తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు ఓ అద్దె ఇల్లు చూస్తుండగా మూడు నెలల క్రితం పరిచయం అయిన వడ్లమూరు చెందిన అంగర రాఘవులు ఈమె పరిస్థితిని ఆసరాగా తీసుకుని పథకం ప్రకారం ఆమెను అత్యాచారం చేయాలనే ఉద్దేశంతో వెదురుమూడికి చెందిన తన స్నేహితుడైన దుర్గా ప్రసాద్ తో కలిసి ఈనెల 22వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో బాధితురాలికి అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి తన ద్విచక్రవాహనంపై జొన్నాడ వైపు నుండి తీసుకు వస్తుండగా బాధితురాలు తన ఇంటి వద్ద దింపమని ప్రాధేయపడి అడగగా తన బంధువుల ఇంటి వద్ద ఈ రాత్రికి ఉండి రేపు ఉదయాన్నే మీ ఇంటి వద్ద దింపుతానని నమ్మబలికి గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్న (వడ్లమూరు ముద్దాయి ఇంటివద్ద) ఇంటికి తీసుకుని వెళ్లి రాఘవులు ఆమెను అత్యాచారం చేశాడని బాధితురాలు తన వాంగ్మూలంలో తెలిపినట్లు డిఎస్పీ తెలిపారు. కాగా బాధితురాలు “దిశ” యాప్ సహాయం కొరకు ఫోన్ చేయగా రాఘవులు ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు వెళ్ళిన ఆచూకీ లభ్యం కాలేదు. కాగా దిశ యాప్ కు వచ్చిన లొకేషన్ ఆధారంగా బాధితురాలిని సంఘటన స్థలానికి తీసుకువెళ్లడంతో గుర్తు పెట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. కాగా అత్యాచార సంఘటన ఆలమూరు మండలం జొన్నాడ లో జరిగినట్లు బాధితురాలు తన వాంగ్మూలంలో ఇవ్వడంతో కేసును ఆలమూరు పోలీసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై ముద్దాయి రాఘవులును అరెస్టు చేయగా, అతనికి సహకరించిన దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసు కేవలం దిశ యాప్ ద్వారానే నేర స్థలాన్ని గుర్తించడం సులభతరమైయ్యిందని పోలీసులు తెలిపారు.

* టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు. సహకార చట్టంలోని 6ఏ సెక్షన్ కింద ట్రస్టును స్వాధీనం ఎందుకు చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు.నోటీసులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‍లాల్.వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న కమిషనర్.డీవీసీ ట్రస్టు ద్వారా నడుస్తున్న డీవీసీ ఆస్పత్రి.పాల రైతుల కుటుంబ సభ్యులకు 50శాతం రాయితీతో వైద్యం అందిస్తూ పేరుగాంచిన డీవీసీ ఆస్పత్రి.గతంలో సంగం డెయిరీ స్వాధీనానికి ప్రయత్నం చేసి కోర్టు మొట్టికాయలు వేయడంతో చేతులు ముడుచుకున్న సర్కార్.తాజాగా డీవీసీ ట్రస్టు, డీవీసీ ఆస్పత్రిపై మళ్లీ ప్రారంభమైన నోటీసుల పర్వం.

* ఏపీ మాదకద్రవ్యాల కేంద్రంగా మారిందని జనసేనాని పవన్​కల్యాణ్ అన్నారు.

* హుజూరాబాద్​లో కవర్ల కలకలం.. ఓపెన్ చేస్తే డబ్బులే డబ్బులు..!తెలంగాణలోని హుజూరాబాద్​ ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో కవర్లు కలకలం రేపుతున్నాయి.ఓటర్లను ప్రసన్నం చేసేందుకు డబ్బులతో కూడిన కవర్లు ఓటర్ల చెంతకు చేరుతున్నాయి.వాటిని అందుకున్న ఓటర్లు కవర్లలో ఉన్న డబ్బు చూసి అవాక్కవుతున్నారు.ఒక్కో కవర్​లో రూ.6వేల నుంచి రూ.10 వేల వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.వంద మందికి ఒక స్థానిక నాయకుడిని అప్పజెప్పినట్లుగా పేర్కొన్నారు.పైగా డబ్బులు ఉన్న కవర్లపై నంబర్లు వేసి ఉండడం గమనార్హం.ఒకటో నంబర్ ఉంటే ఒకరికి, రెండో నంబర్ ఉంటే ఇద్దరికీ డబ్బులు అని ఓటర్లు అంటున్నారు.నేటితో ప్రచార ఘట్టం ముగియనున్న నేపథ్యంలో తెరమీదకు వచ్చిన కవర్ల పంపిణీ చర్చనీయాంశంగా మారింది.

* తితిదే బోర్డులో నేరచరిత్ర ఉన్నవారిని నియమించడంపై హైకోర్టు ఆగ్రహం.తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని నియమించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది.తితిదే కార్యనిర్వాహణాధికారికీ నోటీసులివ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.మొత్తం 18 మంది సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది.తితిదే బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి పిటిషన్​ దాఖలు చేశారు.భానుప్రకాశ్‌రెడ్డి పిటిషన్‌పై న్యాయవాది అశ్వినికుమార్ వాదనలు వినిపించారు.ఎంసీఐ మాజీ ఛైర్మన్‌ డా. కేతన్ దేశాయ్‌ నియామకంపై అశ్వినికుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.