Food

తిండి తక్కువ తినమంటున్న కిమ్

తిండి తక్కువ తినమంటున్న కిమ్

ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార కొరతతో అల్లాడుతోంది. కఠినమైన కరోనా ఆంక్షలు, సరిహద్దుల మూసివేత, గతేడాది తుపానుల కారణంగా దేశంలో పరిస్థితులు మరింత దిగజారాయి. దీంతో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పిలుపునిచ్చినట్లు సమాచారం. ధాన్య ఉత్పత్తి ప్రణాళికను నెరవేర్చడంలో వ్యవసాయ రంగం విఫలమైనందునే ఈ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినట్లు కిమ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం! మే నెలలోనే ద.కొరియా ప్రభుత్వానికి చెందిన కొరియా డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్.. ఈ ఏడాది దాదాపు పది లక్షల టన్నుల ఆహార కొరత రావచ్చని అంచనా వేసింది. ఐరాస సైతం దేశంలో ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. అయితే.. ఉ.కొరియా దాన్ని కొట్టిపారేసిన విషయం తెలిసిందే.