DailyDose

నిన్న హైదరాబాద్‌లో…నేడు నందిగామలో…అగని మిస్ తెలంగాణా ఆత్మహత్యాయత్నం-నేరవార్తలు

నిన్న హైదరాబాద్‌లో…నేడు నందిగామలో…అగని మిస్ తెలంగాణా ఆత్మహత్యాయత్నం-నేరవార్తలు

* టీడీపీ నేత బ్రహ్మం చౌదరి అరెస్టు, పోలీసులు కొట్టడంపై వివరణ ఇవ్వాలని గతంలో మంగళగిరి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు.హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ వివరణ ఇచ్చిన మంగళగిరి కోర్టు.మంగళగిరి కోర్టు ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు.పూర్తిగా విచారణ చేపట్టి 10 రోజుల్లో సవివరంగా రిపోర్ట్ దాఖలు చేయాలని గుంటూరు జిల్లా జడ్జికి హైకోర్టు ఆదేశం.

* అరటి పండ్ల చాటున గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్థులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా నాగ్ పూర్ కు అరటిపండ్ల లోడ్ లో గంజాయిని పెట్టి తరలిస్తుండగా.. ఎల్బీనగర్ లో ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.గంజాయి స్మగ్లింగ్ చేసేవారిపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, ఈ క్రమంలోనే చెకింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ లోని అరటి పండ్ల లోడ్ లో గంజాయిని పెట్టి తరలిస్తున్నట్టు తేలిందని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.18.5 లక్షలు ఉంటుందన్నారు. ఘటనకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.

* దేశవ్యాప్తంగా పెళ్లికాని వారికంటే పెళ్లయినవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణమవుతున్నాయి. ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించి జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) 2020 నివేదికలో ఈ వివరాలు పొందుపరిచింది. 2019తో పోలిస్తే 2020లో ఆత్మహత్యలు 5 శాతం పెరిగి 8,058 నమోదైనట్లు వెల్లడించింది. మిగతా వారు పేదరికం, వావాహ సంబంధ విషయాలు, సుఖవ్యాధుల వంటి వాటివల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

* జీవితంపై విరక్తితో హైదరాబాద్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మోడల్‌ మరోసారి కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పైనుంచి మున్నేరులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే మున్నేరు నీటిలో ఉన్న ఆమెను కాపాడి నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్‌ హాసిని(21) హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటోంది. ఓ ప్రైవేటు సంస్థ 2018లో నిర్వహించిన పోటీలో ‘మిస్‌ తెలంగాణ’గా ఎంపికయ్యారు. హిమాయత్‌నగర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఒంటరిగా ఉంటూ మోడలింగ్‌ చేస్తున్నారు. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి బిగించుకొని తన తల్లిదండ్రులు, స్నేహితులకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాల్‌ (కాన్ఫరెన్స్‌) చేశారు. కంగారుపడిన తల్లిదండ్రులు, స్నేహితులు ఫోన్‌లు చేస్తున్నా పట్టించుకోకుండా ఆమె తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ‘ఆత్మహత్య తప్పని తెలుసు. అమ్మా, నాన్న మన్నించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఎవరూ అవసరం లేదు, ఒకసారి యాసిడ్‌ దాడి యత్నాన్ని, మరోసారి వేధింపుల్ని.. ఆపై ఎంతోమంది నుంచి రకరకాల వ్యాఖ్యలను ఎదుర్కొన్నా.. అందరికీ గుడ్‌ బై ఫర్‌ ఎవర్‌’’ అని చెబుతూ.. కాళ్లకింద ఉన్న స్టూల్‌ను తన్నేశారామె. ఇదంతా చూస్తున్న జగిత్యాలలోని ఆమె స్నేహితుడొకరు వెంటనే 100కు ఫోన్‌ చేశారు. ఈ సమాచారం అందగానే నారాయణగూడ పోలీసులు శివప్రసాద్‌, మధు ఆగమేఘాలపై ఆమె ఉండే అపార్టుమెంట్‌కు చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. మెడకు బిగించుకున్న చున్నీ ముడి అదృష్టవశాత్తు విడిపోవడంతో ఆమె మంచంపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హాసినిని ఎందుకు ఆత్మహత్యయత్నం చేశారని ప్రశ్నించగా.. ఆర్థిక ఇబ్బందులని తెలిపినట్లు పోలీసు అధికారి రవికుమార్‌ చెప్పారు. గురువారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చి హాసినిని తమ స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో ఆమె ఇవాళ మరోసారి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

* తోటి విద్యార్థిని కొట్టాడనే కారణంగా ఓ విద్యార్థి పట్ల ప్రిన్సిపల్​ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. అల్లరి చేస్తున్నాడనే కారణంతో.. ప్రిన్సిపల్‌ సదరు విద్యార్థిని బిల్డింగ్​ పైఅంతస్తు నుంచి వేలాడదీశాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారడంతో ఆ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తప్పు చేస్తే సర్దిచెప్పడం పోయి విద్యార్థిని ఇలా శిక్షించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్​లో జరిగింది.

* భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త గుండెపోటుతో కుప్పకూలిన ఘటన విశాఖ జిల్లా రావికమతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రావికమతం గ్రామానికి చెందిన వ్యాపారి వెంకటరమణ (56), భవాని (51) భార్యాభర్తలు. స్థానిక సాయిబాబా గుడికి సమీపంలో కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో భవాని అక్క మనుమడు వర్ధన్‌ను దత్తత తీసుకున్నారు.