కర్నూలు నగరానికి చెందిన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి సోమితకు తానా మాజీ కార్యదర్శి, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి సహకారంతో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహకారం అందజేశారు. కరోనా వైరస్ తీవ్రతతో కుటుంబసభ్యులను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న చేయూత కార్యక్రమంలో భాగంగా ఈ పారితోషికం అందించినట్లు పొట్లూరి రవి తెలిపారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ముప్పా రాజశేఖర్, సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థినికి ఆర్థిక సాయం

Related tags :