ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణాజిల్లాలో పర్యటించారు. అక్కడి స్వర్ణభారత్ ట్రస్ట్ లో యువతతో ముఖాముఖీ నిర్వహించారు. కులం- మతం- వర్గం- జిల్లా పేర్లతో జనాల్ని చీల్చేవారిని దూరం పెట్టాలని వ్యాఖ్యానించారు వెంకయ్య. అందుకే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అని తానెపుడూ చెబుతుంటాననీ… మనం చట్ట సభలకు ఎన్నుకునే నాయకుల- కేరెక్టర్ మాత్రమే కాదు- కేలిబర్ ముఖ్యం- అంతకన్నా మించి కండక్ట్ ఇంపార్టెంట్ అని పేర్కొన్నారు. సరైన నడవడిక లేని నాయకులతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని… ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల వాళ్లూ.. ఒకలాగానే ఉన్నారని పేర్కొన్నారు. “అందుకే చెబుతున్నా వ్యక్తి గుణగణాలు గుర్తించండి. వారి బుద్ధిని గమనించండి. మంచివారినే చట్ట సభలకు పంపండి. పార్లమెంటు, అసెంబ్లీ వంటి చోట్ల సభ్యత- సంస్కారం అత్యంత ముఖ్యం. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. చట్ట సభ్యుల ప్రమాణాలు తగ్గుతున్నాయ్. రాజకీయ ప్రత్యర్ధులపై వారు సంధిస్తున్న పదజాలం అసభ్యకరంగా ఉంటోంది. కొందరు ఎంపీలు, మంత్రులు వాడే భాష కూడా.. దారుణంగా మారడం దురదృష్టకరం. ఇది మారాలని కోరుకుంటన్నా” అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
నాకు అసహ్యం కలుగుతోంది: వెంకయ్య
Related tags :