మనమంతా ఇంట్లో అందంగా అలంకరించిన దీపాల జిగేలు వెలుగుల్లో పండుగ చేసుకుంటాం. కానీ కరీంనగర్‌లో మాత్రం ఓ వింత ఆచారం ఉంది. అదేంటంటే… పట్టణంలోని స్థానికులు శ్మశానాల్లో సమాధుల మధ్య పండుగ జరుపుకుంటారు. చనిపోయిన తమ కుటుంబ సభ్యులను స్మరిస్తూ ఏటా దీపావళి రోజు వారి సమాధుల దగ్గరకు ఇంటిల్లిపాదీ వెళ్లి దీపాలు వెలిగిస్తారు. రకరకాల పిండివంటలు తీసుకెళ్లి అక్కడే భోజనం చేసి టపాసుల్ని కాల్చుతూ సరదాగా గడుపుతారు. ‘వినడానికి విచిత్రంగా ఉన్నా దూరమైన మా కుటుంబ సభ్యుల్ని పండుగ రోజున గుర్తు చేసుకోవడం మాకెంతో ఆనందం’ అంటారు అక్కడివారు.
కరీంనగర్ శ్మశానంలో దీపావళి
Related tags :