DailyDose

తెలుగు అకాడమీ నిధుల స్కాంలో శుభవార్త-నేరవార్తలు

తెలుగు అకాడమీ నిధుల స్కాంలో శుభవార్త-నేరవార్తలు

* బిహార్‌లో దీపావళి పండుగరోజు విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ చంపారన్‌ ప్రాంతంలోని.. తెల్హువా గ్రామంలో కల్తీ మద్యం తాగి 8 మంది మృతి చెందారు.
కాగా, బుధవారం వీరు స్థానికంగా ఉన్న.. ఒక దుకాణంలో.. మద్యంసేవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో వీరిలో కొంత మంది ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వీరిలో 8 మంది చికిత్సపొందుతూ మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరిని డాక్టర్లు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ముజఫర్‌ జిల్లాలో.. గత నెల అక్టోబరు 30 న కల్తీ మద్యంతాగిన.. ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.

* నాటు సారా స్థావరాలను ధ్వంసం చేయడానికి స్యయంగా రంగంలోకి దిగిన కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్.ప్రయాణానికి అనువుగా లేని, కొల్లేటి సరస్సు మధ్యలో గల నిర్మానుష్య ప్రాంతానికి పడవపై ప్రయాణం.బయట వారికెవరికి కనబడకుండా ముళ్ళ పొదల మధ్యలో గల నాటుసారా స్థావరాలను ధ్వంసం చేసిన ఎస్పి.డ్రోన్ కెమెరా సహాయంతో కొల్లేరు నదీ పరివాహక ప్రాంతాల పై ప్రత్యేక పర్యవేక్షణ.నాటు పడవలు సహాయంతో భారీగా నాటుసారా, తయారీ పరికరాలను, వస్తువులను ఒడ్డుకు చేరవేత.నాటు సారా తయారీ కి పాల్పడితే ఉపేక్షించేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఎస్ పి.

* విశాఖలోని అగనంపూడి టోల్‌గేట్‌ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఆనందపురం నుంచి తమిళనాడుకు వెళుతున్న మినీ వ్యానులో 1,200 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.బంగాళదుంపల బస్తాల లోడు కింద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని దువ్వాడ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి గంజాయిని సీజ్‌ చేశారు. దాన్ని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* విశాఖలోని అగనంపూడి టోల్ గేట్ వద్ద గంజాయి పట్టుబడింది. ఆనందపురం నుంచి తమిళనాడుకు అక్రమంగా ఐచర్ వ్యాన్‌లో తరలిస్తున్న 1200 కేజీల గంజాయిని దువ్వాడ పోలీసులు పట్టుకున్నారు. బంగాళదుంప బస్తాల లోడుగా కళ్లుగప్పి క్రింద గంజాయి రవాణాకు దుండగులు యత్నించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన దువ్వాడ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యాన్, గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

*బ్యాంకు సిబ్బంది, మధ్యవర్తులు కుమ్మక్కై స్వాహా చేసిన తెలుగు అకాడమీ నిధులు రూ.65 కోట్లను తిరిగి ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయి. ఇటీవల పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన.. యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(యుబిఐ), కెనరా బ్యాంకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాజేసిన నిధులను అకాడమీకి వెనక్కి ఇస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చినట్లు విద్యాశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, అకాడమీ నిధులు వివిధ బ్యాంకులకు చెందిన 31 శాఖల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఇకపై వాటినన్నింటినీ లీడ్‌ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ)లోనే ఉంచనున్నట్లు ఆ అధికారి తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం నుండి తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల వినియోగంపై కొనసాగుతున్న ఆడిటింగ్‌ ముగిశాక ఆర్థిక శాఖ నుంచి మార్గదర్శకాలు విడుదల కానున్నాయని అన్నారు.