* గాయత్రి తపస్వి శంబలనగరి
* రుషి తండ్రి ఆధ్యాత్మిక నిలయంలో ప్రతిష్ట
* రుషి తండ్రి తపశ్శక్తి స్వీకరించే మహదవకాశం
గాయత్రి…గాయత్రి…గాయత్రి…నిత్యం గాయత్రి చింతన. పగలు, రాత్రి…వర్షాకాలం, ఎండాకాలం అనే తేడా లేదు. ఎల్లవేళలా గాయత్రిలోనే నిమగ్నం. గాయత్రి చింతనలో సదా లీనమైన రుషి. 36 సంవత్సరాల ఆధ్యాత్మిక సాధన. 13 సంవత్సరాలుగా మౌనం. అయిదు సంవత్సరాలుగా ఏకాంత అజ్ఞాత మౌన గాయిత్రి తపస్సులో ఉన్న రుషి తండ్రి. హిమాలయాలకు వెళితేగాని తపస్సు కుదరదనే ఛాందసానికి కాలం చెల్లే విధంగా మన మధ్యనే తాను ఉంటున్న ఆశ్రమంలోనే నిత్యం గాయత్రిలోనే గడుపుతున్న తపస్వి ఆయన. ఆ రుషే ధ్యానం నాన్న గారు. రుషి తండ్రి. ఆ రుషి తన తపశ్శక్తితో నింపిన తొమ్మిది అడుగుల పంచలోహ గాయత్రిమాత విగ్రహం. గాయత్రి తపస్వి శంబలనగరి. గాయత్రి తపస్వి తపస్సు చైతన్యం నింపిన పంచలోహ విగ్రహాన్ని తాకి రుషి తండ్రి తపశ్శక్తిని స్వీకరించే మహదవకాశం ప్రతిష్ట సందర్భంగా కలగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా ఎస్.కోట సమీపంలోని రాజీపేట (ఎస్.కోట-పెదఖండేపల్లి రోడ్డు) రుషి తండ్రి ఆధ్యాత్మిక నిలయంలో ఏర్పాటు చేసే గాయత్రిమాత విగ్రహ ప్రతిష్ట ముహూర్తం ఖరారు అయింది. మహర్షి ధ్యానం నాన్నగారి ఆశ్రమంలో 29 నవంబర్ 2021న ఉదయం 9.06 గంటలకు విగ్రహ ప్రతిష్ట జరగనుంది. వచ్చిన భక్తులకు ఈ సందర్భంగా అన్న ప్రసాదం అందించనున్నారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వాస్తవానికి నవంబర్ 21వ తేదీ నుంచే మొదలవుతుంది. 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ అంటే ఎనిమిది రోజులపాటు అభిషేకం, హోమం, గోవు పూజా కార్యక్రమాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని పౌరులు ప్రతి వొక్కరూ వచ్చి గాయత్రిమాత విగ్రహాన్ని తాకి రుషి తండ్రి తపశ్శక్తిని స్వీకరించాలని గాయత్రి తండ్రి ఆధ్యాత్మిక బిడ్డలు కోరుతున్నారు.