ScienceAndTech

గూగుల్ తప్పనిసరి నిబంధన. ఖాతాదారులకు ముఖ్య గమనిక.

గూగుల్ తప్పనిసరి నిబంధన. ఖాతాదారులకు ముఖ్య గమనిక.

సైబర్‌ నేరాల సంఖ్య పెరిగిపోతుండటంతో యూజర్స్‌కి సురక్షితమైన సేవలను అందించేందుకు టెక్ కంపెనీలు పటిష్ఠమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గూగుల్ యూజర్స్‌ ఇకమీదట తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేందుకు రెండు దశల ధృవీకరణను (2 Step Verification or 2SV – టూ స్టెప్ వెరిఫికేషన్) తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి గూగుల్ ఈ ఏడాది మేలో కీలక ప్రకటన చేసింది. తాజాగా నవంబరు 9 నుంచి యూజర్స్‌ తమ ఖాతాలలోకి లాగిన్ కావాలంటే టూ స్టెప్ వెరిఫికేషన్‌ తప్పనిసరి కానుంది. ‘‘2021 చివరికల్లా 150 మిలియన్‌ గూగుల్ యూజర్స్‌, 2 మిలియన్ల యూట్యూబ్‌ యూజర్స్‌ ఈ ఫీచర్‌ను తప్పక ఉపయోగించాల్సిందే’’ అని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది.