దీపావళి పండుగను భారతదేశం మొత్తం జరుపుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి. అలాంటి పండుగను ప్రవాస భారతీయులు పక్క దేశాల్లో జరుపుకోవడానికి చట్ట సభల్లో తీర్మానాలు పెట్టి ఆమోదించుకుంటున్నారు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్ర సెనెట్ హౌస్.. దీపావళి పండుగకు అధికారిక గుర్తింపు ఇచ్చిందని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయురాలు జహనాబేగం తెలిపారు. సెనెటర్ జిమ్ రన్ స్టడ్ తీర్మాన్నాన్ని ప్రతిపాదించగా.. మరో సెనెటర్ డేటా పోల్ హంకి మద్దతు తెలిపారు. మంగళవారం సాయంత్రం సెనెట్ హౌస్ ఆ తీర్మాన్నాన్ని ఆమోదించిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తనతో పాటు ఓరుగంటి శ్రీనివాస్, సన్నీరెడ్డి, పెద్దిబోయిన జోగేశ్వరరావు, డా.హర్షా కృష్ణ, కొంపల్లి నర్సరాజ్ తదితరులను స్టేట్ క్యాపిటల్ భవన్ కు ఆహ్వానించారని పేర్కొన్నారు.
https://www.misenategop.com/runestad-resolution-honors-diwali-celebration/