DailyDose

విశాఖలో అక్రమ బంగారం..బెజవాడ డ్రగ్స్‌పై సీపీ ప్రకటన-నేరవార్తలు

విశాఖలో అక్రమ బంగారం..బెజవాడ డ్రగ్స్‌పై సీపీ ప్రకటన-నేరవార్తలు

* విశాఖలో భారీ మొత్తంలో బంగారం పట్టుకున్న డి ఆర్ ఐ అధికారులు.యశ్వంత్ పుర్ -హౌరా ఎక్స్ ప్రెస్ లో బంగారం పట్టివేత.అక్రమ బంగారాన్ని విశాఖలో పట్టుకున్న డీఆర్ఐ అధికారులు.రూ 1.91 కోట్ల విలువైన 3.89 కిలోల బంగారం పట్టివేత.కోల్ కత్తా నుంచి వస్తున్న ప్రయాణికుడి వద్ద బంగారం గుర్తింపు.బంగ్రాదేశ్ -కోల్ కత్తా మీదగా అక్రమ బంగారం తరలిస్తున్నట్టు అధికారులు గుర్తింపు.

* ఎస్ఈబి అధికారుల స్పెషల్ డ్రైవ్..వివరాలు వెల్లడించిన సీపీ శ్రీనివాసులు.సీపీ శ్రీనివాసులు..కామెంట్స్.డ్రగ్స్ , గంజాయి ,అక్రమ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాం..6 కోట్ల విలువైన గుట్కా స్వాధీనం చేసుకొని.. 570 మంది పై చర్యలు తీసుకున్నాం..8వేల కేజీలను గంజాయి సీజ్ చేసి 250 కేసులు నమోదు చేశాం..14 వందల వాహనాలు సీజ్ చేసి 4 వేల మంది అరెస్ట్ చేశాం..హెరాయిన్ కేసుపై మరోసారి సీపీ క్లారిటీ.గుజరాత్ హెరాయిన్ కేసుకు విజయవాడకు సంబంధం లేదు..డ్రాగ్ రాకెట్ ఢిల్లీ కేంద్ర కార్యకలాపాలు జరిపింది..విజయవాడ అడ్రస్ ను 2 సార్లు ఉపయోగించారు..నగరంలో రౌడిసీటర్ల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం..18 మంది రౌడీ షీటర్స్ లను నగర బహిష్కరణ చేశాము..116 మందిపై కొత్తగా షీట్స్ ఓపెన్ చేశాం..3 వేల మంది పై సస్పెక్ట్ షీట్స్ పెట్టి అరెస్ట్ చేసి మండల మెజిస్ట్రేట్ ముందు పెట్టాం..కొండపల్లి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం..

* మంచిరేవుల ఫామ్​హౌస్​లో పేకాట కేసులో ప్రధాన నిందితుడు సుమన్ కుమార్ చౌదరి కస్టడీ విచారణ ముగిసింది. రెండు రోజుల కస్టడీలో భాగంగా నార్సింగి పోలీసులు పలు కీలక సమాచారాన్ని రాబట్టారు. అతని ఫోన్​లోని వాట్సాప్ ఛాటింగ్​ను పరిశీలించారు. పలు సందేశాలపై ఆరా తీశారు. ఎక్కడెక్కడ క్యాసినోలను నిర్వహించారని ప్రశ్నించారు.

* జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో నవభారతి పామాయిల్ ఫ్యాక్టరీలో బీహార్-మధ్యప్రదేశ్ వర్కర్ల మధ్య ఘర్షణ..ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కూలీలు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పికెట్ ఏర్పాటు చేసిన వైనం.

* అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి