* అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భారత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రోహిత్ ఖనా పార్ధీవదేహం కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం అత్కూరు గ్రామం చేరుకుంది.. ఐఏఎస్ అధికారి అడుసుమిల్లి రాజమౌళి మేనల్లుడు కావటంతో అయన స్వగ్రామం అత్కూరు కి పార్ధీవ దేహం తరలించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ , ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ,గద్దె అనురాధ, ఐఏఎస్ అధికారి రాజమౌళి పలువురు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. విమానశ్రయం నుంచి అత్కూరు కి పార్ధీవదేహం చేరుకోగానే రాజమౌళి , రోహిత్ ఖన్నా తల్లిదండ్రులు బంధువులు అర్తనాదాలు మిన్నంటాయి.గత మంగళవారం అమెరికా డల్లాస్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి షాపింగ్ వెళ్తుండగా కారు వెళ్తుండుగా రోహిత్ కారుని మరో కారు ఢీకొట్టింది.. దింతో రోహిత్ ఖన్నా అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు స్నేహితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసి కి చెందిన రోహిత్ చెన్నై ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ బి.టెక్ అమెరికాలో. ఎం.ఎస్ పూర్తి చేసి డల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పనిచేస్తున్నాడు. రేపు భారతదేశానికి రావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయి. రోహిత్ ని కడసారి చూసేందుకు ఉత్తరప్రదేశ్ వారణాసిను కుటుంబ సభ్యులు , స్నేహితులు , తెలుగు రాష్ట్రాల్లోని ఐఏఎస్ అధికారి రాజమౌళి బంధుమిత్రులు , పలువురు ప్రముఖులు అత్కూరు కి తరలివస్తున్నారు.అనంతరం శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ఐఏఎస్ అధికారి రాజమౌళి ఉత్తరప్రదేశ్ సివిల్ సఫ్లై కమీషనర్ గా పనిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న హాయంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. పదోన్నతి పై ఉత్తరప్రదేశ్ వెళ్లారు. https://www.gofundme.com/f/help-rohit-khannas-funeral
* మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అహ్మద్‌నగర్‌లోని కొవిడ్ ఆస్పత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐసీయూ వార్డులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. మంటల ధాటికి బయటకు రాలేక చిక్కుకుపోయిన ఆరుగురు కరోనా పేషెంట్స్ సజీవదహనమయ్యారు. ప్రమాదం సమయంలో కరోనా వార్డులో 17మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారని స్థానికులు తెలిపారు. అగ్నిప్రమాదంలో గాయపడ్డ మిగిలిన 11మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బందితో సహా వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది.
* ఆ సినిమాలో చూపించినట్లే నన్ను కూడా హింసించారు. కస్టడీలో తనను హింసించడంపై దర్యాప్తు కోరినా ఇప్పటివరకు దిక్కులేదని నరసాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. జై భీమ్ సినిమాలో చూపించినట్లే తనను కూడా పోలీసులు హింసించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
* కారులో ప్రయాణిస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తనను ఫోటో తీసినందుకు ఓ నాయకుడు కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్ రెడ్డి.. ‘నా కారునే ఫోటో తీస్తావా?’ అంటూ వాగ్వాదానికి దిగాడు. తానెవరో తెలుసా అంటూ గొడవ చేశాడు. ఇదంతా వీడియో తీసిన కానిస్టేబుల్.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
* యాదాద్రిలో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు మాజీ మావోయిస్టులను అరెస్టు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ‘‘నిందితులు పిట్టల శ్రీనివాస్, నాగమలయ్య, శ్రీనివాసరెడ్డి, స్వామి గతంలో జనశక్తి గ్రూప్‌లో పనిచేశారు. ప్రధాన నిందితుడు పిట్టల శ్రీనివాస్‌కు తుపాకీ తయారు చేయడం తెలుసు. వీరంతా యాదాద్రిలో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాగమలయ్య గతంలో ఓ హత్యకేసులో నిందితుడు. శ్రీనివాసరెడ్డితో కలిసి నాగమల్లయ్య 1996లో పనిచేశారు. పిట్టల శ్రీనివాస్ అతని భార్య పుష్ప మావోయిస్టులు. వీరి నుంచి 3 తుపాకులు, నాటు తుపాకీ, 6 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నాం’’ అని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.