* పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ.. కరెన్సీ నోట్ల చలామణి సైతం క్రమంగా పుంజుకుంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్-19 మూలంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ముందుజాగ్రత్తగా నగదు దగ్గర ఉంచుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల చలామణి పెరిగింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, చెల్లింపు యాప్‌లు.. ఇలా పలు సాధనాల ద్వారా డిజిటల్ చెల్లింపులు సైతం భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూపీఐకి దేశంలో భారీ ఆదరణ లభిస్తోంది.నల్లధనం కట్టడి, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ఐదేళ్ల క్రితం నవంబరు 8న రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, డిజిటల్ చెల్లింపుల లక్ష్యం ఒకింత ఫలితాలిచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, గత సంవత్సరం కాలంగా నోట్ల చలామణి మళ్లీ పెరుగుతుండడం గమనార్హం.ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. నవంబరు 4, 2016లో(నోట్ల రద్దుకు ముందు) రూ.17.74 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయి. అక్టోబరు 29, 2021 నాటికి అవి రూ.29.17 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక గత ఏడాది కాలంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.2,28,963 కోట్లు పెరిగింది. క్రితం ఏడాది ఈ పెరుగుదల రూ.4,57,059 కోట్లుగా నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య 16.8 శాతం పెరగ్గా.. వాటి విలువ రూ.7.2 శాతం పెరిగింది. 2019-20లో ఇవి వరుసగా రూ.14.7 శాతం, 6.6 శాతంగా ఉన్నాయి.యూపీఐ సేవలను 2016లో ప్రారంభించిన విషయం తెలిసిందే. నెలనెలా ఈ మాధ్యమం ద్వారా చేస్తోన్న చెల్లింపుల సంఖ్య పెరుగుతోంది. అక్టోబరులో 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.7.71 లక్షల కోట్లుగా నమోదైంది.
* పేరు మార్చుకొన్నా.. ఫేస్‌బుక్‌ను వివాదాలు వీడటంలేదు. చికాగోకు చెందిన టెక్ సంస్థ ‘మెటా కంపెనీ’ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఫేస్‌బుక్ రీబ్రాండింగ్ పేరిట తన పేరు(మెటా)ను, జీవనాధారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఈ మేరకు మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్ స్క్యూలిక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫేస్‌బుక్ తన సంస్థను కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో.. మీడియా శక్తిని ఉపయోగించి కనుమరుగు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఫేస్‌బుక్ ఎప్పుడూ చెప్పేదొకటి.. చేసేదొకటి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనను బహిరంగ వివరణగా భావించాలని ఆయన వెల్లడించారు. గత మూడు నెలలుగా కంపెనీని చౌకగా విక్రయించాలని ఫేస్‌బుక్ లాయర్లు వెంటాడుతున్నారని నేట్ వెల్లడించారు. తాము ఫేస్‌బుక్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 28వ తేదీన పేరును మెటాగా మారుస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మెటా కంపెనీ’ కోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది.
* దేశ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై కేంద్రం ఈ నెల 15న అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో చర్చలు జరుపనున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రాష్ర్టాల సీఎంలకు లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో వృద్ధి కనిపిస్తున్నదని, ఈ వృద్ధి కొనసాగితే రాష్ర్టాలకు పెట్టుబడులు, ఉద్యోగాలు, రాబడులు పెరుగుతాయని తెలి పారు. కేంద్రం రాష్ర్టాల సమన్వయంతోనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 15న మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు సీఎంలు, ఆర్థిక మం త్రులు వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని కోరారు.
* తమ బ్యాంక్ సేవలు సోమవారం 45 నిమిషాల సేపు నిలిచిపోతాయని ప్రైవేట్ బ్యాంక్ సిటీ బ్యాంక్ తన ఖాతాదారులకు మెసేజ్‌లు పంపింది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటల నుంచి 3.45 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఈ-మెయిల్స్ ద్వారా సమాచారమిచ్చింది.
* ప్రస్తుతం వాహన మార్కెట్లు ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ఈవీ వాహన కొనుగోలుదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య పెట్రోల్ వాహనాల ట్యాంక్ నింపినంత వేగంగా ఈవీలను ఛార్జ్ చేయాలకపోతున్నాము. ఈ సమస్యను అధిగమించడానికి నెదర్లాండ్స్ దేశానికి చెందిన ఒక సంస్థ సౌర శక్తితో నడిచే కార్లను తయారు చేస్తున్నాడు. ఈ కారును రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఛార్జ్ చేస్తే చాలు అని పేర్కొంటున్నారు. “లైట్ ఇయర్” అనే సంస్థ ప్రతిరోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేని సౌర శక్తితో నడిచే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. “లైట్ ఇయర్ వన్” అనే పేరుతో పిలిచే ఈ కారును కొన్ని నెలల వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. లైట్ ఇయర్ సీఈఓ లెక్స్ హోఫ్స్లూట్(Lex Hoefsloot) మాట్లాడుతూ.. లైట్ ఇయర్ వన్ పై ఇప్పటికే 20 మన్నిక పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో ఈ కారును రహదారి మీదకు తీసుకొనిరావాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మోడల్ 83 కిలోమీటర్లకు ఒక వాట్ మాత్రమే వినియోగించినట్లు తెలిపింది. ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కంటే మూడు రెట్లు తక్కువ.