అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఆటా నాదం” పాటల పోటీలను అంతర్జాలంలో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 200 మంది గాయనీ గాయకులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మధు బొమ్మినేని, రామకృష్ణా రెడ్డి ఆళ్ల, అనిల్ బొద్దిరెడ్డి, శరత్ వేముల, శారద సింగిరెడ్డిలు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. అక్టోబర్ 23న ప్రారంభమయిన ఈ పోటీల సెమి ఫైనల్స్ నవంబర్ 6న జరిగాయి. నిహాల్ కొందూరి, విజయలక్ష్మి, సాయి శ్రీకాంత్ వెళ్లల, నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇరు తెలుగు రాష్ట్రాలనుండి పదకొండు మంది గాయని గాయకులు అభినవ్ అవసరాల, గీత మహతి పిసుపాటి, జ్యోస్న నిమ్మలపాడి, లక్ష్మి శ్రీవల్లి కాందూరి, లేఖ సదా ఫణిశ్రీ వీర,మేఘన నాయుడు దాసరి, నిగమ నెల్లుట్ల, ప్రణతి కే, సాయి శృతి పొలిశెట్టి, సాకేత్ కొమ్మజోస్యుల,వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల 13న జరిగే తుదిసమరానికి చేరుకున్నారు. డిసెంబర్ 5,2021 నుండి డిసెంబర్ 25 2021 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో, ఆటా అధ్యక్షులు భువనేశ్ బూజల, పాలక మండలి సభ్యులు కార్యవర్గ బృందంతో కలిసి విద్య , వైద్య , కమ్యూనిటీ సేవలు, స్త్రీ సంక్షేమ , బిజినెస్ సెమినార్స్ , ఎడ్యుకేషనల్ సెమినార్స్ తదితర కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. “ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలే” రవీంద్రభారతి హైదరాబాద్ డిసెంబర్ 26న నిర్వహిస్తారు. “ఆటా నాదం” విజేతలకు ఈ కార్యక్రమంలో బహుమతులను అందజేస్తారు.
“ఆటా నాదం” పోటీలకు విశేష స్పందన
Related tags :