పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రెండు రోజులపాటు అట్టహాసంగా జరిగింది. సినిమా రంగానికి సంబంధించి.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు వరించింది. ఎస్పీబీ తరఫున ఆయన తనయుడు చరణ్ మంగళవారం ఈ అవార్డుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్వీకరించారు. గాయని చిత్ర పద్మభూషన్ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అవార్డుని కంగనా రనౌత్, అద్నాన్ సమీ, కరణ్ జోహార్, ఏక్తా కపూర్ సోమవారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు.
“భారతరత్న” ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్….
Related tags :