NRI-NRT

వెల్వడంలో బాలిరెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు

వెల్వడంలో బాలిరెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు

వెల్వడం లో బాలిరెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు. అమెరికాలో ఇటీవల మృతి చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు లక్కిరెడ్డి బాలిరెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కృష్ణాజిల్లా వెల్వడంలో నిర్వహించడానికి ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం నాడు క్యాలిఫోర్నియాలో సంతాప సభ నిర్వహించిన అనంతరం బాలిరెడ్డి మృతదేహాన్ని మాతృదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు అనంతరం గురువారం నాడు పెద్దకర్మ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన సోదరుడు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి తెలిపారు. డాక్టర్ హనిమిరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు అమెరికా నుండి ఆదివారం సాయంత్రం మైలవరం చేరుకుంటున్నారు.