సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రముఖ దర్శకుడు రవిబాబు కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఆయన డైరెక్షన్‌లో పూర్ణ హీరోయిన్‌గా మూడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. రవిబాబు వరసగా ఆమెతో సినిమాలు చేయడం చూసి వారిమధ్య ఎదో నడుస్తోందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై పూర్ణ కానీ, రవిబాబులు కానీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో నిజంగానే వీరిద్దరికి ఎఫైర్ ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌పై నటుడు రవిబాబు స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత హీరోయిన్లతో మాట్లాడటం కానీ, వారిని కలవడం కానీ తాను చేయనని చెప్పాడు. విలువలకు తాను ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఇక పూర్ణ అభినయం చూసే ఆమెను మూడు సినిమాల్లో తీసుకున్నానని చెప్పాడు. అంతే తప్పా మరో కారణం వల్ల కాదని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా రవిబాబు దర్శకత్వంలో ‘అవును’, ‘అవును 2’, ‘లడ్డుబాబు’ సినిమాల్లో పూర్ణ నటించింది. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది.
రవిబాబు-పూర్ణలపై పుకార్లకు ఫుల్‌స్టాప్
Related tags :