NRI-NRT

స్కాట్‌ల్యాండ్ తెలుగు సంఘం(TAS) దీపావళి వేడుకలు

స్కాట్‌ల్యాండ్ తెలుగు సంఘం(TAS) దీపావళి వేడుకలు

తెలుగు అసోసియేషన్ అఫ్ స్కాట్లాండ్TAS, UK ఆధ్వర్యంలో దీపావళి సంబరాలను EDINBURGH, UKలో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. PRO విజయ్ కుమార్ పర్రి, సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్ నూక, స్పోర్ట్స్ కార్యదర్శి సాయి చైతన్య ప్రత్తిపాటి, సంధానకర్తలు భవాని చిటికిరెడ్డి, వ్యాఖ్యాతలు వైష్ణవి శ్రీనివాస్, రిత్విక్ గాలి వేడుకల విజయవంతానికి కృషి చేశారు. టాస్ చైర్మన్ మైథిలి కెంబూరి ఈ కార్యక్రమం జరుపుకోవటం చాల ఆనందంగా ఉంది అన్నారు. సంస్థ అధ్యక్షులు శివ చింపిరి టాస్ చేసిన కార్యక్రమాలను విశ్లేషించారు. కోశాఖాధికారి వెంకటేష్ గడ్డం, మహిళా కార్యదర్శి మాధవి అప్పరాల, జనరల్ సెక్రెటరి ఉదయ్ కుమార్ కూచడి తదితరులు పాల్గొన్నారు.
స్కాట్‌ల్యాండ్ తెలుగు సంఘం(TAS) దీపావళి వేడుకలు