* రూ.2 లక్షల జీతం వస్తున్నా రూ.30వేలకు కక్కుర్తి పడి ఓ విద్యుత్ అధికారి అనిశావలలో చిక్కాడురూ.2 లక్షల జీతం వస్తున్నా రూ.30వేలకు కక్కుర్తి పడి ఓ విద్యుత్ అధికారి అనిశావలలో చిక్కాడు. అతణ్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.అధికారిగా రూ.2లక్షలు జీతం వస్తున్నా…రూ.30 వేల లంచానికి కక్కుర్తిపడిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ) అనిశాకు దొరికిపోయాడు. హైదరాబాద్‌లోని గోల్కొండ ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.రంగారెడ్డి జిల్లా అనిశా డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు..ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్‌డివిజన్‌లో చరణ్‌సింగ్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నాడు. మొయినాబాద్, శంకర్పల్లి, నార్సింగ్, ఇబ్రహీంబాగ్ డివిజన్లలో జరిగే పనులను పర్యవేక్షిస్తాడు. మణికొండకు చెందిన గుత్తేదారు రవి కొన్నేళ్లుగా ఆ శాఖలో చిన్నచిన్న పనులు చేస్తున్నారు. మణికొండలో విద్యుత్తు తీగలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చడం సహా కొత్త ట్రాన్స్ఫార్మర్లు అమర్చే పనుల టెండరును ఇటీవల దక్కించుకున్నారు. అందుకు అవసరమైన అనుమతి పత్రాన్ని ఇచ్చేందుకు ఏడీఈ లంచం కోరడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు శుక్రవారం మధ్యాహ్నం గుత్తేదారు రూ.30వేలతో ఏడీఈ కార్యాలయానికి వెళ్లారు. లంచం సొమ్మును చరణ్‌సింగ్ తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ‘విచారణ అనంతరం ఆయన్ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించామని, ఆయన ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగిస్తున్నామని’ డీఎస్పీ తెలిపారు
* మహరాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్. సంభవించింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. కాల్పుల్లో… ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.
* వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని కల్కొడ చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మర్పల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మర్పల్లి నుంచి వేర్వేరు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రయాణికులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లాలోని మలసోమారం, పెద్దాపూర్, ఇందోల్, తాండూర్, సదాశివపేట్, మొరంగపల్లి, కొడంగల్, జహీరాబాద్, పద్దేముల్, కేశారం, తదితర గ్రామాలకు చెందిన ప్రయాణికులు గాయపడ్డారు
* ప.గో.జిల్లా ఉండిలో ఎనిమిదేళ్ళ బాలికపై 74 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం.
* గుంటూరు జిజిహెచ్ లో ఈ సి జి స్కానింగ్ రూమ్ లో స్కానింగ్ తీసే క్రమంలో మహిళలు ను అసభ్యంగా ఫోటోలు తీస్తున్న వ్యక్తిపై కొత్త పేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు…. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.