బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వేడుకగా నిర్వహించారు. ప్రవాస చిన్నారులు, సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సినీ నటి లయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల ఫాషన్ షో హుషారుగా సాగింది. చిన్నారులకు “చిత్ర లేఖనం” పోటీ నిర్వహించారు. ఇందులో వందకు పైగా చిన్నారులు పాల్గొన్నారు. సాంప్రదాయ రుచికరమైన తెలుగు భోజనాన్ని అతిథులు ఆస్వాదించారు. 50 సంవత్సరాలుగా నిర్విరామంగా తెలుగు భాష , సంస్కృతిని ప్రతి తరానికి దగ్గర చేస్తూ సాగుతున్న GWTCS, కరోనా సమయంలో అమెరికా-ఇండియాల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాలను గుర్తుచేస్తూ, తమ సంస్థకు సామాజిక బాధ్యత కూడా ఒక భాగమని అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు పేర్కొన్నారు. తానా, ఆటా, టీడీఎఫ్, కాట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
వైభవంగా GWTCS దీపావళి
Related tags :