NRI-NRT

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ సర్వసభ్య సమావేశం

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) యొక్క ఎనిమిదవ వార్షిక సర్వ సభ్య సమావేశం నవంబర్ 14 వ తేదీన జూమ్ మాధ్యమం ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో సుమారు 50-60 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఏడవ సర్వసభ్య సమావేశపు వివరాల తో పాటు 2020-2021 ఆర్థిక సంవత్సరపు రాబడి మరియు ఖర్చుల పట్టిక కను సభ్యులకు వివరించిన తరువాత ఆమోదం పొందడం జరిగింది. ఈ పట్టిక ను ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు జూలూరి సంతోష్ కుమార్ మరియు నంగునూరి వెంకట రమణ తో పాటు సొసైటీ జీవిత కాల సభ్యులు శివనాథుల సత్యనారాయణ గార్లు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు ముద్దం విజ్జేందర్ మరియు ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్ మరియు ప్రధాన కార్యదర్శి సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మోడరేటర్ గా సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు వ్యవహరించారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లు గా సేవలందించిన సౌందరిపల్లి మనోహర కృష్ణ మరియు కైలాసపు కిరణ్ గార్లకు కృతజ్ణతలు తెలియజేసారు. మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లు గా కిరణ్ కుమార్ ఎర్రబోయిన మరియు శివ రెడ్డి అద్దుల గార్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.

ఈ సమావేశం లో సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, బొడ్ల రోజారమణి, నంగునూరి వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు గార్లపాటి లక్ష్మా రెడ్డి, నడికట్ల భాస్కర్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, రవి కృష్ణ విజ్జాపూర్, కాసర్ల శ్రీనివాస రావు, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్ మరియు అనుపురం శ్రీనివాస్ గార్ల తో పాటు ఇతర జీవిత కాల మరియు సాధారణ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.