Business

అక్టోబరులో 12.5శాతం పెరిగిన ద్రవ్యోల్బణం-వాణిజ్యం

అక్టోబరులో 12.5శాతం పెరిగిన ద్రవ్యోల్బణం-వాణిజ్యం

* హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్ఐ) మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గ్రాజియా 125 ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.87,138 (ఎక్స్‌ షోరూమ్‌, గురుగ్రామ్‌)గా నిర్ణయించింది. రెప్సోల్‌ హోండా రేసింగ్‌ టీమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని కొత్త ఎడిషన్‌ను తీర్చిదిద్దారు. దేశంలోని రేసింగ్‌ ఔత్సాహికుల కోసం ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ఎండీ, ప్రెసిడెంట్‌, సీఈవో అత్సుషి ఒగాటా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

* భారత్‌ ప్రభుత్వం నుంచి వచ్చిన బిలియన్‌ డాలర్లు విలువైన పన్ను వాపసు ప్రోసీడ్స్‌ను భవిష్యత్తులో కంపెనీ షేర్ల బైబ్యాక్‌కు వినియోగించనున్నట్లు కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ పేర్కొంది. భారత్‌ లభించే భారీ పన్ను వాపస్‌తో భారీ ఎత్తున షేర్ల బైబ్యాక్‌ చేయనున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా 20 మిలియన్‌ డాలర్లతో తొలుత సాధారణ వాటాల కొనుగోలు చేపట్టినట్లు పేర్కొంది. ఈ షేర్ల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలను మోర్గాన్‌ స్టాన్లీ చూసుకొనేట్లు ఒప్పందం కుదుర్చుకొంది. మోర్గాన్స్‌ స్టాన్లీ నుంచి ఈ షేర్లు కెయిర్న్‌కు బదిలీ అవుతాయి.

* టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబరులో 12.54 శాతంగా నమోదైంది. ఇది ఐదు నెలల గరిష్ఠం కావడం గమనార్హం. తయారీ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలే ద్రవ్యోల్బణం ఎగబాకడానికి ప్రధాన కారణం. ఏప్రిల్‌ నుంచి వరుసగా ఏడో నెలా ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదైంది. సెప్టెంబరులో 10.66 శాతానికి తగ్గినప్పటికీ.. మళ్లీ గత నెల పెరగడం గమనార్హం.

* దేశంలో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ఇంటి నుంచే అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉండటంతో ఎగబడి కొనుగోళ్ళు చేస్తున్నారు. పండుగ సీజన్‌లో ఈ-కామర్స్‌ సంస్థలు కూడా భారీగా ఆఫర్లు ప్రకటించడం కూడా కలిసొస్తున్నది. దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారి సంఖ్య పెరుగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ విలువ రెండున్నర రెట్లు పెరిగి 500 బిలియన్‌ డాలర్ల(రూ.37 లక్షల కోట్లు)కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని బెంగళూరుకు చెందిన రెడ్‌సీర్‌ సర్వే వెల్లడించింది.
వచ్చే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కొత్తగా 2.4 కోట్ల కుటుంబాలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయనున్నారని అంచనా