కెనడాలోని ఒంటారియో రాష్ట్ర డర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఒషావా నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాస యువతీయువకుల ప్రదర్శనలు అలరించాయి. ముఖ్య అతిథిగా కెనడా ఎంపీ రయాన్ టర్న్‌బుల్ హాజరయ్యారు. భారతీయుల కృషి కెనడా దేశ అభివృద్ధిలో భాగమైందని ఆయన కొనియాడారు. సంస్థ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు మేకల రవి, పిడపర్తి గౌతం, సింగిశెట్టి శ్రీకాంత్, చిలువేరి వెంకట్, సర్ధార్ ఖాన్, కమల మూర్తి, రమేష్ ఉప్పలపాటి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా డర్హం తెలుగు క్లబ్ దీపావళి
Related tags :