గరుడ పురాణాలు రెండు. ఒకటి 108 అధ్యాయాలతో శ్రీరంగక్షేత్ర విశిష్టతను వివరించింది. పై ప్రశ్న దీని గురించి కాదు. దాదాపు ఇరవై వేల శ్లోకాలతో శ్రీమహా విష్ణువు గరుత్మంతునికి అనేక అంశాలు వివరించిన రెండో గరుణ పురాణం గురించే సందేహాలు. యోగం, సాంఖ్యం, పాపపుణ్యాల వివరణ, స్వర్గనరకాల ప్రస్తావన, యమలోక వర్ణన, ప్రేతకర్మలు మొదలైనవి ఇందులో ఉన్నాయి. భయోత్పాతం కలిగించే అంశాలు ఉన్నందున ఈ గ్రంథం ఇంట్లో ఉంటే మంచిది కాదనే ప్రచారం జరిగింది. అలా చేసింది శాస్త్రపరిజ్ఞానం లేనివాళ్లే. తాత్విక చింతనతో సాగే గరుడపురాణం నిరభ్యంతరంగా ఇంట్లో ఉండొచ్చు.
గరుడ పురాణం ఇంట్లో ఉండవచ్చా?
Related tags :