NRI-NRT

భారతీయులకు సింగపూర్ శుభవార్త

భారతీయులకు సింగపూర్ శుభవార్త

భారతీయులకు సింగపూర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీకా రెండు డోసులు తీసుకున్న భారతీయులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధన లేకుండా దేశంలోకి అనుమతించనున్నట్టు చెప్పింది. ఈ నెల 29 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే, వ్యాక్సినేషన్ పూర్తయిన ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ దేశ పౌరులకు కూడా క్వారంటైన్ నిబంధన ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. అయితే, ఇండోనేషియన్లకు ఈ నెల 29 నుంచి ఇది వర్తిస్తుందని, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ దేశాలకు మాత్రం డిసెంబరు 6 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.