NRI-NRT

వైకాపా అరాచకాలను దుయ్యబట్టిన జయరాం

వైకాపా అరాచకాలను దుయ్యబట్టిన జయరాం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న దౌర్జ‌న్యాల‌కు అంతే లేకుండా పోతుంద‌ని, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై నీచ‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఎన్నారై టీడీపీ నేత జయరాం కోమటి అన్నారు. రాష్ట్ర శాస‌న స‌భ‌లో చంద్ర‌బాబు, ఆయ‌న భార్య‌పై వైసీపీ నాయ‌కులు చేసిన దారుణ‌మైన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. అధికారం ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడితే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. అధికార ప్ర‌భుత్వ తీరును తప్పుప‌ట్టారు.