Politics

రజనీకాంత్ చంద్రబాబు నాయుడు కు ఫోన్?

రజనీకాంత్ చంద్రబాబు నాయుడు కు ఫోన్?

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనలపై సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.
ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై శాసనసభలో పలువురు నేతలు చేసిన వ్యక్తిగత దూషణలపై అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం చంద్రబాబుకు రజనీకాంత్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. శాసనసభలో జరిగిన ఘటనలతో మానసికంగా బాధపడుతోన్న ఆయన్ను పరామర్శించారు. అనంతరం ఏపీలో ఉన్న పరిస్థితుల గురించి చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు.