కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్ హాసన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్ చేశారు.