ప్రతిపక్షంపై రాక్షస రాజకీయ క్రీడ
◆అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుల పర్వం
◆అధికారపార్టీకి జీహుజూర్ అంటున్న పోలీసులు
◆కారంచేడు సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు
◆పదేళ్ల తర్వాత పగబట్టి కేసులు
◆అక్కయ్య చౌదరిని అరెస్టు చేసిన పోలీసులు
◆అక్కయ్య అరెస్టును ఖండించిన ఎమ్మెల్యే ఏలూరి
అధికార పార్టీ అరాచకాల పర్వం కొనసాగుతోంది… ప్రతిపక్ష పార్టీ నాయకులే లక్ష్యంగా… అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాజకీయ రాక్షస క్రీడకు తెర లేపారు. కారంచేడు సహకార సొసైటీ లో అక్రమాలు జరిగాయంటూ పదేళ్ల తర్వాత గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అక్కయ్య చౌదరిని అరెస్టు చేయించి రాక్షస ఆనందం పొందుతున్నారు. సొసైటీ అభివృద్దే లక్ష్యంగా పని చేసిన ఆయన పై రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారు.
రాజకీయ కక్ష సాధింపు తగదు… ఎమ్మెల్యే ఏలూరి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కారంచేడు ఎంపిటిసి యార్లగడ్డ చౌదరి అక్రమ అరెస్టు సరికాదని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ అరెస్టులు చేస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అక్కయ్య చౌదరిని కావాలనే రాజకీయ కక్షతో అరెస్టు చేశారన్నారు. అక్కయ్య చౌదరికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిని అక్రమాలు జరిగాయంటూ అరెస్టు చేయడం వైసిపి ద్వందనీతికి నిదర్శనం అన్నారు.