అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) సహకారం అందించారు. అమెరికాలో తెలిసినవారు లేకపోవటం, ఆసుపత్రి ఖర్చులు అధికమౌతుండటంతో ఇండియా వెళ్లి ఫిజికల్ థెరపీ చేయించుకోవల్సిందిగా వైద్యులు సూచించారు. వీరి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు సమకూర్చి వీరు ఇరువురిని TTA ప్రతినిధులు భారత్ తరలించారు. వీరు పూర్తిగా కోలుకున్న అనంతరం అమెరికా వచ్చి విద్యాభ్యాసాన్ని కొనసాగించేలా అధికారులతో మాట్లాడారు. తమకు తోడ్పడిన TTA సంస్థకు, అధ్యక్షుడు పట్లోళ్ల మోహన్, వ్యవస్థాపకుడు డా.పైళ్ల మల్లారెడ్డిలకు విద్యార్థులు ఇద్దరు ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలో గాయపడిన తెలుగు విద్యార్థులకు TTA సాయం
Related tags :