Politics

ఎందుకీ బూటకం, ఎందుకీ నాటకం, అమరావతి పైTNI కథనాలు

ఎందుకీ బూటకం, ఎందుకీ నాటకం, అమరావతి పైTNI కథనాలు

అమరావతి- సీఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో బిల్లు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి

అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు శాసనసభలో ప్రకటించిన ప్రభుత్వం

గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లు ను పెట్టిన మంత్రి బుగ్గన

ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏకు బదిలీ చేస్తున్నట్టు బిల్లులో ప్రస్తావించిన ప్రభుత్వం

భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరపకపోవటం, శాసనమండలి లో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లటం వంటి అంశాలు వికేంద్రీకరణ చట్టాన్ని వెనక్కు తీసుకోడానికి కారణాలుగా తెలిపిన ప్రభుత్వం

వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నట్టు శాసనసభకు ఇచ్చిన ప్రకటనలో పేర్కోన్న ప్రభుత్వం

తక్షణమే సీఆర్డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో పేర్కోన్న ప్రభుత్వం

అమరావతి అంటే నాకు వ్యతిరేకం కాదు నా సొంత ఇల్లు కూడా అమరావతి లోనే ఉంది… వైఎస్ జగన్

ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి చెందిన అతి పెద్ద నగరం విశాఖపట్నం విశాఖపట్నం లో అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది విశాఖలో మౌలిక వసతులుకు పెట్టుబడి పెడితే ఐదేళ్లలో మహా నగరంగా రూపాంతరం చెందుతుంది …వైఎస్ జగన్

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే వైయస్సార్ పార్టీ ఆకాంక్ష

మెరుగైన బిల్లును మళ్లీ సభ ముందుకు తీసుకొస్తాం వైఎస్ జగన్

అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో రద్దు చేసిన అమరావతి-సీఆర్‌డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన బిల్లును ప్రవేశపెట్టారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఎంఆర్‌డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్‌డీఏకు బదిలీ చేస్తున్నట్టు బిల్లులో ప్రస్తావించారు. భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరపకపోవటం, శాసనమండలిలో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లడం వంటి అంశాలు వికేంద్రీకరణ చట్టాన్ని వెనక్కి తీసుకోడానికి కారణాలుగా తెలిపారు. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

……. బ్రేకింగ్

అసెంబ్లీలో ముఖ్యమంత్రి ……

1) రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవి. నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్పూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగింది.

2) గతంలో కేంద్రీకరణ ధోరణలు, వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమయింది. మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం.

3) అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు… వీరందరి ఆశలూ ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే, మన ప్రభుత్వానికి గడచిన ఈ రెండున్నరేళ్ళలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు, ఈప్రభుత్వాన్ని.

4) అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదననుకూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మన కళ్లతో చూశాం.

5) ఈ నేపధ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగాగానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటినికూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది.

6. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.

పాత బిల్లును వెనక్కి తీసుకున్నాం..సమగ్రమైన కొత్త బిల్లు వస్తుంది – సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ప్రభుత్వం సీఆర్డీఏ బిల్లు ఉపసంహరించుకున్న నేపధ్యంలో బ్రేక్ పడనున్న మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యకలాపాలు

సీఆర్డీఏ పరిధిలో ఉన్న మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ లో ఉన్న విలీన గ్రామాలు

సీఆర్డీఏ చట్టం అమల్లోకి రావటంతో ఆ పరిధిలో ఉన్న గ్రామాలన్ని తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి

సీఆర్డీఏ చట్టం రద్దు అయితేనే ఆ పరిధిలో ఉన్న గ్రామాలు మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే అవకాశం

ఇప్పటికే ప్రజల అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ, నిబంధనలు ఉల్లంఘించి ఎంటీఎంసి పేరుతో మొండిగా ముందుకెళ్లిన అధికారులు

ఇప్పటికే కార్పొరేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ న్యాయస్థానం పరిధిలో విచారణ దశలో ఉన్న 46 కి పైగా పిటిషన్లు

మరి అధికారులు ప్రజాప్రతినిధులు మాటలకు తలోగ్గి ముందుకెళ్తారో నిబంధనలు పాటిస్తారో వేచి చూడాలిసిందే

ఎందుకీ బూటకం ఎందుకీ నాటకం అమరావతి పైTNI కథనాలు

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకోవడం హర్షణీయం.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సాగుతున్న పోరాటానికి ఇది తొలి విజయం.

అమరావతి రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి.

అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నా

: సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.

అమరావతి రైతుల విజయం తథ్యం అని ముందే చెప్పా

రైతుల విజయానికి అమిత్ షా కూడా కారణమే

ఇక ఎలాంటి మెలికలు పెట్టే సాహసం జగన్ చేయలేడు ఇక నుంచి అయినా రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టాలి

నేను కూడా అమరావతి కోసం ముడుపు కట్టాను

ఇది కచ్చితంగా రైతుల విజయమే

జగన్ ఇకపై పిచ్చి నిర్ణయాలు తీసుకోరని అనుకుంటున్నా

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన

చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే

శుభం కార్డుకు మరింత సమయం ఉంది

సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్

నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా

ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు

అమరావతి రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా?

అమరావతి రైతుల పాదయాత్ర.. పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర

రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి కామెంట్స్

ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదే

ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యం

ప్రజల అభీష్టం మేరకే ఏపీ బీజేపీ అమరావతి రాజధానికి మద్దతుగా నిర్ణయం తీసుకుంది

రైతుల‌ మేలును దృష్టిలో పెట్టుకునే కేంద్రం రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంది

__ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి