Politics

కొండపల్లి మునిసిపాలిటీని తేదేపా దక్కించుకుంటుందా??

కొండపల్లి మునిసిపాలిటీని తేదేపా దక్కించుకుంటుం దా??

ఇబ్రహీంపట్నం లో హై ఓల్టేజ్…!!!

కొండపల్లి:- కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థి గా గెలిచిన అడ్వకేట్ ధరణికోట విజయలక్ష్మి కార్యాలయం ఎదుట పొలిటికల్
హంగామా….!!!

కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం రేపటికి వాయిదా….??

ఇప్పటివరకు మున్సిపల్ కార్యాలయం లో ఉండిపోయిన ఎంపి కేశినేని నాని, టిడిపి తరుపున గెలిచిన కౌన్సిలర్లు…!!

ఇతర సభ్యుల కంటే ముందుగానే కార్యాలయం నుండి బయటకు వచ్చేసిన ధరణికోట విజయలక్ష్మి…!!

చైర్మన్ పీఠం కోసం ధరణికోట పట్టు…!!

తనకు కాకుండా వేరే వారికి ఇస్తున్నారు అనే ప్రచారం జరగడం తో అలక బూనిన ధరణి కోట…..!!

బుజ్జగించేందుకు యత్నిస్తున్న టిడిపి అధినాయకత్వం….

పాలక వర్గం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టిడిపి కి ఊహించని పరిణామం గా చెబుతున్న రాజకీయ విశ్లేషకులు….

కొండపల్లి …

మున్సిపల్ కార్యాలయం నుండి కౌన్సిలర్లు మరియు ఎంపీ కేశినేని నానిని భద్రత సెక్యూరిటీ సిబ్బంది మధ్య బస్సులో గొల్లపూడి టిడిపి పార్టీ కార్యాలయానికి తరలించిన పోలీసులు…