NRI-NRT

చంద్రబాబు కుటుంబానికి ఒహాయో ప్రవాసుల సంఘీభావం

చంద్రబాబు కుటుంబానికి ఒహాయో ప్రవాసుల సంఘీభావం

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై అధికారపక్షం చేసిన ఆరోపణలను నిరసిస్తూ అమెరికాలోని ఒహాయో రాష్ట్ర ప్రవాసులు సమావేశమయ్యారు. మహిళలను గౌరవించాలని, రాజకీయాల్లో కుటుంబ సభ్యులపై నిందలు వేయడం తగదని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధిపై జగన్ సర్కార్ దృష్టి సారించాలని వారు హితవు పలికారు. కార్యక్రమంలో ప్రభల జగదీష్, కొడాలి బాలాజీ, పసుమర్తి వేణు, సంగా శ్రీనివాస్, యడ్లపల్లి విజయకృష్ణ, పాతూరి కోటేశ్వరరావు, తేళ్ల ఫణి, మన్నే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.