DailyDose

TNI నేటి నేర వార్తలు 26-Nov-2021

TNI నేటి నేర వార్తలు 26-Nov-2021

* గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ లో నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద రైల్లో గంజాయి మత్తులో ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు ఇద్దరికి గాయాలు. నెక్కొండ నుండి వరంగల్ కు బయల్దేరిన గోల్కొండ రైలు. గాయాలతో ఇద్దరు రైల్లో డోర్ లకు వేలాడుతూ ప్రయాణం.

* 2800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసిన బందరు తాలూకా పోలీసులు

జిల్లాలో నాటు సారా తయారీని పూర్తిగా అరికట్టాలన్న జిల్లా SP శ్రీ సిద్ధార్థ్ కౌశల్ IPS., గారి ఆదేశాల మేరకు, బందరు DSP షేక్ మాసుం భాషా గారి సూచనల మేరకు, బందరు రూరల్ CI కొండయ్య గారి పర్యవేక్షణలో సారా తయారీ కేంద్రాలపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు బందరు రూరల్ పోలీసులు

ఈరోజు బందరు మండలం పెద కరగ్రహారం గ్రామ శివారు గౌడ పాలెంలో ముళ్ళ పొదల్లో గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికీ అనుమానం లేకుండా నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో బందరు తాలూకా SI,G.వాసు గారు తన సిబ్బందితో కలిసి నాటు సారా నిల్వలకై అన్వేషణ చేస్తుండగా, ముళ్ళ పొదల్లో ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసి భూమిలో పాతిపెట్టిన 2800 లీటర్ల బెల్లపు ఊటను, 20లీటర్ల నాటు సారా,రెండు సారా బట్టి సామాన్లను ధ్వంసం చేసినట్లు,ఇది ఎవరు తయారు చేస్తున్నారో విచారణ జరుపుతామని,గ్రామాల్లో ఎవరైనా నాటు సారా తయారు చేసినా, అమ్మినా అటువంటి వారిపై కటినమైన చర్యలు తీసుకుంటామని SI గారు హెచ్చరించారు.

* SI షఫీ సస్పెండ్

వివాహితతో ఎస్ఐ రాసలీలలు భర్తలేని సమయంలో ఇంటికొచ్చి కామక్రీడలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన భర్త వనపర్తి జిల్లాలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే. వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న షేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ. భర్తలేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగిస్తున్నాడు.

స్థానికులు, స్నేహితుల సాయంతో ఈ విషయం తెలుసుకున్న భర్త ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ నెల 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి సమీపంలోనే కాపుకాశాడు. దీంతో ఆ మహిళ ఎస్‌ఐకి ఫోన్ చేయగా అతడు క్షణాల్లోనే ప్రియురాలి ఇంట్లో వాలిపోయాడు. ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతుండగా భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆవేశంతో రగిలిపోయిన భర్త స్నేహితులతో కలిసి ఎస్ఐని విచక్షణా రహితంగా చితకబాదాడు. అడ్డొచ్చిన భార్యను కూడా చావబాదాడు.

తనను వదిలేయాలని ఎస్ఐ ప్రాధేయపడాలని వినిపించకుండా వారంతా చితకబాదడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎస్ఐని కాపాడి వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐ‌ షేక్ షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వక్రబుద్ది చూపిన ఖాకీకి తగిన శాస్తి జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

* తెలంగాణా రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోర్ట్ కు రవాణా అవుతున్న బియ్యం లారీ ని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. AP 24 TA 2759 నెంబరు లారీ లో పి.డి.ఎస్. బియ్యం రవాణా అవుతున్నదని అందిన సమాచారం మేరకు పోలీసులు లారీని సీజ్ చేసారు. నకిలీ బిల్లులను సృష్టించి బియ్యాన్ని రవాణా చేస్తున్నారని పట్టుకున్న బియ్యం పి.డి.ఎస్. బియ్యం అని నిర్దారించేందుకు శాంపిల్ తీసి ఏలూరు ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపిస్తున్నామని రిపోర్ట్ వచ్చిన అనంతరం కేసు నమోదు చేస్తామని జంగారెడ్డిగూడెం డిప్యూటీ తాహసీల్దార్ సురేశ్.

* యాంకర్ పార్ట్: తెలంగాణ బార్డర్ పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఇతర రాష్ట్రాల నుండి  వరి ధాన్యం తో వస్తున్న లారీలను ఆపి.. వెనక్కి పంపుతున్న తెలంగాణ పోలీసులు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రిపూట ఇలా నడిరోడ్డు మీద లోడ్ తో ఉన్న లార్రీలను ఆపడం ఏమిటి  అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా లారీ డ్రైవర్లు.

వా.ఓ: జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు పుల్లూర్ టోల్ ప్లాజా దగ్గర తెలంగాణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వరి ధాన్యాన్ని తో వస్తున్న లాయర్లను ఆపి వెనక్కి పంపుతున్న పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో కి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వరి ధాన్యం కు అనుమతి లేదంటూ తిరిగి పంపుతున్నారు పోలీసులు. ఎటువంటి ముందస్తూ  సమాచారం లేకుండా రాత్రిపూట వరి ధాన్యం లార్రీలను ఇలా ఆపేస్తే మేము ఎలా వెళ్లాలి అంటూ తెలంగాణ పోలీసులపై మండిపడుతున్న లారీ డ్రైవర్లు. టోల్ ప్లాజా వద్ద భారీగా నిలిచిపోయిన  వరి లోడ్ తో ఉన్న లారీలు.

ఆంద్రప్రదేశ్ నంద్యాల, కర్నూలు, ఎమ్మిగనూరు, తదితర ప్రాంతాల నుండి భారీగా RNR రకంకు చెందిన వరి ధాన్యం ను తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ కు నిత్యము వందల లారి లు వందల టన్నుల కొద్దీ వరి ధాన్యం తో లారీ లు వెల్లుచున్నారు. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రం లోకి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వరి లోడ్ తో ఉన్న లారీ లను బోర్డర్ లో తెలంగాణ పోలీసులు తనిఖీ లు నిర్వహించి వాటి తిరిగి వెన్నక్కు పంపుతున్నారు.

* పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం

యాంకర్ వాయిస్
పగో. జిల్లా.నరసాపురంలో
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయడంతోపాటు వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీకి చట్టం చేయాలని, విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తదితర అంశాలపై రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నరసాపురం అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సామూహిక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సర కాలంగా పట్టుదలతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న రైతులకు జేజేలు పలికారు. మోడీ ప్రభుత్వం రైతులు,కార్మికుల పట్ల నియంతగా వ్యవహారిస్తోందని విమర్శించారు. రైతులకు, కార్మికులకు హాని కలిగించే అన్ని చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నరసాపురం నియోజకవర్గ నాయకులు కావూరి బుజ్జి సంఘీభావం తెలిపారు. ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలు) నాయకులు పూరిళ్ళ శ్రీనివాస్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఈ కార్యక్రమంలో ముచ్చర్ల త్రిమూర్తులు, వై.చిట్టిబాబు,టి.సత్యనారాయణ,జి.శ్రీరామచంద్రుడు,బి.శ్రీనివాస్,కె.శ్రీనివాస్,పి.కామేశ్వర రావు,కె.బాబూరావు,ఎం.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

* విజయవాడ

సీపీ బి. శ్రీనివాసులు
ఈనెల 30న రిటైర్డ్ అవుతున్నాను
ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు
విజయవాడలో ఏసీపీగా, అడిషనల్ సీపీగా పని చేసాను
సీపీగా రెండుసార్లు పనిచేశాను
నాలుగు వేలమంది సిబ్బందితో కలిసి పని చేసాను
డీజీపీకి, సహచరులకు, సిబ్బందికి నా కృతజ్ఞతలు.

ఫేక్ ఎఫ్డీల వ్యవహారం హైదరాబాదులో ప్రారంభమై విజయవాడకు చేరాయి
ఆత్కూర్, భవానీపురంలలో కేసులు నమోదయ్యాయి
కొత్త వ్యక్తులు చాలామంది బయటపడ్డారు
ఏడుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసారు
హైదరాబాద్ నుంచి 8మందిని పీటీ వారెంట్ పై తీసుకొచ్చాం
దాదాపు 2కోట్లు సొమ్ము రికవరీ చేసాం.

2.57 కోట్ల ఆస్తులను సీజ్ చేసి, కోర్టుకు అందజేసాం
11.4 కోట్లు కొత్త మోసం చేసేందుకు ఫేక్ ఎఫ్డీలు తయారు చేసారు
వరుస పరిశోధనలతో 11.4 కోట్ల ప్రభుత్వ సొమ్ము మోసం జరగకుండా ఆపాం
ఇంకా 8 కోట్ల సొమ్ము రికవరీ కావల్సి ఉంది
బ్యాంకులలో సిబ్బంది, మేనేజర్లు, బ్రోకర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు
లోన్ల ముసుగులో డిపాజిట్ల దంధా జరుగుతోంది
వచ్చిన సొమ్ములను హవాలా కోసం కూడా ఎఫ్డీ నేరస్థులు వినియోగించారు.

* తిరువూరు మధిర రోడ్డు దేవసముద్రం చెరువు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. మండలం లోని ఎరుకోపాడు నుండి తిరువూరుకు 11 మంది కూలీలతో వస్తున్న ఈ ఆటో ప్రమాదంలో కొంగల సుబ్బారావు అనే యువకుడు అక్కడికక్కడే మృత్యువాత పడగా 8 మంది గాయాలపాలయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధిక వేగం,మద్యం మత్తు ప్రమాదంకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీస్ లు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. తిరువూరు ఎస్సై చి హెచ్ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మండలం లోని అనేక గ్రామాల్లో నాటు సారా,అక్రమ మద్యం విక్రయాలు దిగువ మధ్య తరగతి కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. అధికారులు అడపా,దడపా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికి పరిస్థితిలో మార్పు రావటం లేదంటే అక్రమార్కులకు కఠిన శిక్షలు పడక పోవటం తో మరింత రెచ్చి పోతున్నారు. మహిళా సంరక్షకులు పూర్తి స్థాయిలో విధుల పట్ల అంకిత భావంతో పని చేసి గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాల పట్ల ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించి నట్లయితే పరిస్థితి మెరుగు పడే అవకాశం ఉందనేది అధిక సంఖ్యాకుల అభిప్రాయం.

* రాష్ట్రాల మధ్య మరొ కొత్త వివాదం కర్నూలు:- తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆంధ్ర నుంచి వెళ్లే వరి ధాన్యం లారీలను తెలంగాణ సరిహద్దు టోల్‌గేట్ దగ్గర ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉన్నట్టుండి తెలంగాణ ప్రభుత్వ అనధికారిక ఆదేశాలతో ఆంధ్ర వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ఆదేశాలతో ఆంధ్ర రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యాపారులు భయపడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రైతులకు దాన్యం నిలువ కష్టంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్ర ప్రభుత్వం చర్చించి పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.