Movies

న్యూమోనియాతో కిమ్స్‌లో జేరిన సిరివెన్నెల

న్యూమోనియాతో కిమ్స్‌లో జేరిన సిరివెన్నెల

ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో రెండు రోజుల నుంచి బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి సిరివెన్నెలకు కిమ్స్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు సిరివెన్నెలను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు.