* నేడు రేపూ ఒక్క మోస్తరు వర్షాలు హైదరాబాద్,
అమరావతి: బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు దక్షిణంగా ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి.
ఆ తరవాత అది బలపడి పశ్చిమ, వాయువ్య దిశగా కదిలే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి.
వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్‌జిల్లా సల్కాపూర్‌లో 12.9డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
రాయలసీమ,
దక్షిణ కోస్తాలో శనివారం భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
* అత్యంత ఖరీదైన స్థలం పై పెద్దల కన్ను పడింది ఇంకేముంది పక్కా ప్రణాళికతో భూమిని కా చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు…. స్థానికులు విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆందోళనతో వెనక్కి తగ్గారు మళ్లీ అదే స్థలాన్ని చదును చేయడంతో విద్యార్థులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది వరంగల్ నగరంలోని ఓ కళాశాల ఇక్కడ లక్షలాది మంది విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉన్నత పదవుల్లో ఉన్నారు అంతటి గొప్ప వ్యక్తులను తయారు చేసిన ఘనత ఈ కళాశాల ఉంది అదే వివేకానంద జూనియర్ కళాశాల. పోచమ్మ మైదాన్ నర్సంపేట ప్రధాన రహదారి పక్కకి ఉన్న ఈ కళాశాల. సుమారు నాలుగు ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది వివేకానంద జూనియర్ కళాశాల ప్రాంగణం. మండి బజార్ లో ని మహబూబియా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల కాలేజీలు షిఫ్ట్ ల వారిగా నడుస్తుండేది దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేపథ్యంలో 1975 సంవత్సరంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వివేకానంద జూనియర్ కళాశాల కాశిబుగ్గ లోని మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని కాలేజీ కోసం కేటాయించారు.
అప్పటినుండి ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉంది. 2019 సంవత్సరంలో కాలేజీ గాలి స్థలంపై ప్రజాప్రతినిధుల కన్ను పడింది దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కాలేజీ పాలకవర్గం పై ఒత్తిడి తీసుకు వచ్చింది, పాలకవర్గం ప్రజా ప్రతినిధి ఒత్తిడికి తలొగ్గి చేతులెత్తేయడంతో 2019లో ప్రాంగణంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుచేసేందుకు తవ్వకాలు చేపట్టారు. కాలేజ్ ప్రాంగణంలో పెట్రోల్ బంక్ ఏంటని పూర్వ విద్యార్థులు స్థానికులు ప్రస్తుత విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అప్పుడు పెట్రోల్ బంక్ ఏర్పాటుచేసేందుకు నిర్ణయించుకున్న ప్రజా ప్రతినిధులు వెనక్కి తగ్గారు. మళ్లీ ఇప్పుడు 2021లో కళాశాల ప్రాంగణంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుచేసేందుకు పనులు చేస్తుండడంతో మళ్లీ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే మహబూబియా కళాశాల కనుమరుగయ్యే పరిస్థితి లో ఉంది అదే దారిలో వివేకానంద జూనియర్ కళాశాల కనుమరుగయ్యే ప్రమాదం ఉందని మేధావులు విద్యావేత్తలు అంటున్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని విద్య కోసం కేటాయిస్తే ఇప్పుడు కొందరు నాయకులు విలువైన ఖాళీ స్థలాన్ని ఎందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వారి ప్రయత్నాలు కచ్చితంగా అడ్డుకుంటామని కాలేజీ విద్యార్థులు పూర్వ విద్యార్థులు అంటున్నారు. వీరి చర్యలు ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో భవిష్యత్ విద్యార్థులకు ఏమీ మిగలకుండా అయ్యే ప్రమాదం ఉందని మేధావులు అంటున్నారు బైట్ పెరుమాళ్ళ లక్ష్మణ్ కేడల ప్రసాద్.
* చంద్రబాబు సంచలన నిర్ణయం… ఇకపై కఠినంగా ఉంటా… టీడీపి అధినేత చంద్రబాబు…
అమరావతి : పార్టీలో చేరికల సందర్భంగా టీడీపీ అధినేత కీలక వ్యాఖ్యలు –
వలస పక్షులకు టీడీపీలో ఇక స్థానం లేదన్న చంద్రబాబు –
ఎన్నికలకు ముందు వాసన పసిగట్టి పార్టీలో చేరే వారికి ఛాన్స్ ఇవ్వనన్న చంద్రబాబు-
కష్టకాలంలో పనిచేసినవారికే ఇకపై గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసిన టీడీపీ అధినేత –
గతంలో ఈ సిద్ధాంతంలో కఠినంగా ఉండలేకపోయానన్న చంద్రబాబు –
ఎవరేంటో అన్నీ రికార్డ్స్ లో రాసిపెడుతున్నాం :
టీడీపీ అధినేత చంద్రబాబు
* కాంగ్రెస్ వరి దీక్ష.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎంపీ
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ గా రైతు లను కాపాడుకోవాల్సిన భాధ్యత కాంగ్రెస్ పార్టీ పై ఉంది.
వనాకాలం ధాన్యం కొనుగోలు ను పక్కన పెట్టి. యాసంగి పంట గురించి మాట్లాడుతున్నారు.
కేసీఆర్ ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ అడగలేదు.
కేసీఆర్ కు మానవత్వం లేదు.. డబ్బు సంపాదించడమే ద్యేయంగా పనిచేస్తున్నాడు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత కరెంట్ ఇస్తే..కరెంట్ తీగలమీద బట్టలు ఆరేసుకోవాలా అని చంద్రబాబు ఎద్దేవా చేసాడు..
వైఎస్ ఉచిత కరెంట్ ఇచ్చి చూపెట్టాడు .
ఇందిరాగాంధీ చేయలేని ధైర్యాన్ని సోనియా గాంధీ చేసి తెలంగాణ ఇచ్చింది.
కేసీఆర్ నాలుక కోసినా తప్పులేదు.
అబద్దాలతో కేసీఆర్ పబ్బం గడుపుతున్నారు.
అవసరం లేని కొత్త సెక్రటేరియట్ కడుతున్న కేసీఆర్.. ఇప్పుడు ఆ డబ్బులు రైతు లకు ఉపయోగపడేవి కాదా..
కేసీఆర్ దొంగ ల ముటాకు మేస్ర్తీ లా ఉన్నాడు.
పార్లమెంట్ లో తెలంగాణ రైతు సమస్యలపై మా గళం వినిపిస్తం.
కేసీఆర్ లా ఢిల్లీ వెళ్లి ఇంట్లో పడుకోం…ప్రధాని ఆఫీసు ముందు కూర్చుంటం..
రైతు లతో పెట్టుకుంటే..ఇక అంతే సంగతులు.
రైతులను పట్టించుకోని చంద్రబాబు పని ఏమైందో అందరూ చూస్తున్నారు.
ఓ వైపు రైతు లు ఇబ్బందులు పడుతుంటె..టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాంపు లకు పోతున్నారు.
* హైదరాబాద్/అమరావతి
పత్రికా ప్రకటన
చిత్తూరు జిల్లాలో వరద బీభత్సంతో నిరాశ్రయులైన కుటుంబాలకు ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు శుక్రవారం కూడా కొనసాగాయి.
★ రవాణా సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతాల్లోకి కూడా ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు వెళ్లి ఇంటింటికి పాలు, రొట్టెలు, భోజనం మరియు మందులు కూడా పంపిణీ చేశారు.
★ తిరుపతి రూరల్ పరిధిలోని రామచంద్రపురం మండలం చిడతూరు గ్రామంలో 600 భోజన పాకెట్లు, 500 పాల పాకెట్లు, 600 ట్రెడ్ పాకెట్లు అందజేశారు.
★ వరద బాధితులకు ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలకు స్పందించి, డల్లాస్ లో స్థిరపడ్డ తిరుపతికి చెందిన ఎన్నారై వెంకట్ జిల్లలముడి రూ.2 లక్షలు విరాళాన్ని ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు అందించారు.
కె. రాజేంద్ర కుమార్ ఐపిఎస్ (రిటైర్డ్)
ముఖ్య నిర్వహణధికారి
ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్
* తెలంగాణ (హైకోర్టు)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
★ హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్ రెండో దశ ప్రారంభంపై వివరణ సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది.
★ 2017 నాటికే ప్రారంభం కావాల్సిన ఎంఎంటీఎస్ రెండోదశ ఇప్పటికీ ప్రారంభం కాలేదని పేర్కొంటూ ఎం.శ్రీనివా్‌సరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
★ చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి వాదనలు నమోదు చేసుకుంది.
★ ఈ వ్యవహారంపై వివరణ సమర్పించాలని నోటీసులు జారీచేసింది.
విచారణ ఆరువారాలపాటు వాయిదా పడింది.
* అమరావతి : ఇంగ్లిష్ రాకపోతే ఏ బాత్రూమ్‌లోకి వెళ్లాలో కూడా తెలియక ఇబ్బంది పడతామని శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే లుంగీలను తెలుగుతోనూ, ప్యాంట్లను ఇంగ్లిష్‌తోనూ ఆయన పోల్చారు. రోజంతా ప్యాంట్లు వేసుకున్నా రాత్రి లుంగీలు కట్టుకుంటామంటూ. రెండు భాషలూ అవసరమేనన్నారు. తెలుగు తల్లిలాంటిదని, ఇంగ్లిష్ భార్యలాంటిదని చెప్పారు. శాసనసభ సమావేశాల చివరిరోజు విద్యారంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. అందులో ఇంగ్లిష్ మీడియం అవసరాన్ని గురించి మాట్లాడుతూ విచిత్రమైన పోలికలు తెచ్చారు. ఆయన ఇంగ్లిష్‌పై మాట్లాడుతున్నంతసేపూ స్పీకర్ సహా అందరూ నవ్వుతూనే కనిపించారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తమిళనాడులో పుట్టి ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికా వెళ్లారన్నారు. ఇక చివర్లో సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ. గ్రీకులో ఒక సామెత ఉందని దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన తెచ్చుకున్న పేపరు కనిపించలేదు. ‘కావాలంటే గూగుల్‌లో కొట్టి చూడాల’ని సభ్యులకు సూచించారు. చివరకు ఆయన తెచ్చుకున్న సామెతలపేపరు దొరకింది. అందులో ఏముందో చదివి వినిపించాలని సహచర సభ్యులు కోరగా. ‘అది గ్రీకులో ఉంది’ అని తన ప్రసంగాన్ని ముగించారు.
* కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి వెంటనే విమాన సర్వీసులను నిలిపివేయాలని ప్రధాని మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఎంతో కృషి, ఎన్నో కష్టాల తర్వాత మన దేశం కరోనా నుంచి కోలుకుందని చెప్పారు. ఈ కొత్త వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించకుండా ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆఫ్రికా దేశాల నుంచి ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఉదయం మెడికల్, సైంటిఫిక్ ఎక్స్ పర్ట్ లతో సమావేశం కాబోతున్నానని చెప్పారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని నిపుణులను కోరానని తెలిపారు.
* అమరావతి:
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అఫిడవిట్‍కు అనుబంధంగా కొత్తగా తెచ్చిన బిల్లులను కోర్టుకు సమర్పించిన ఏపీ ప్రభుత్వం.
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వం.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వం.
అందుకు అనుగుణంగా సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకే ఈ బిల్లులు ఉపసంహరించుకున్నాం.
చట్టం రద్దు ద్వారా సీఆర్డీఏను పునరుద్ధరించాం.
శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం.
శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత న్యాయబద్ధత లేదంటున్న రైతుల తరపు న్యాయవాదులు.
చట్టాలను వెనక్కి తీసుకున్నా మళ్లీ బిల్లు పెడతామనడంపై రాజధాని పరిరక్షణ సమితి ఆగ్రహం.
సోమవారం వాదనలకు సిద్ధమవుతున్న న్యాయవాదులు.
కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‍లో ఉన్న బిల్లులను అధ్యయనం చేస్తున్న రైతుల తరపు న్యాయవాదులు.
* జగన్ పాలనలో వైఫల్యం చెందారు… ఉండవల్లి
చంద్రబాబు పై అగౌరవరంగా మాట్లడుతూంటే జగన్ ఏం చేస్తున్నారు… ఉండవల్లి…
అమరావతి:-
ఏపీ సీఎం జగన్ పాలనలో ఘోర వైఫల్యం చెందారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే అని చెప్పారు.
ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని ఆయన ఆక్షేపించారు. రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
”సీఎంగా జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతారని ఊహించలేదు. 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకొని. మళ్లీ పెడతాం అనడం ప్రభుత్వ వైఫల్యమే. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. చంద్రబాబునుద్దేశించి అగౌరవంగా మాట్లాడుతుంటే జగన్ ఏం చేస్తున్నారు? ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే అంత అవివేకం ఇంకోటి లేదు.
ఉన్నన్నాళ్లు అప్పులపై నెట్టుకొచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని రోడ్డుపై పడేయడమే వైకాపా ఉద్దేశం. ఇప్పటి వరకు చేసిన అప్పులు తీర్చడానికి కూడా మళ్లీ అప్పులు తెస్తామని చెప్పడం. దీని కోసం ఎఫ్‌ఆర్‌బీఎమ్ చట్టాన్ని ఇష్టారీతిన సవరించడం దుర్మార్గం. రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడగటానికి కేసుల భయం. అఖిల భారత సర్వీసు అధికారులు సైతం ప్రస్తుత పరిస్థితిపై నిర్ఘాంత పోతున్నారు” అని ఉండవల్లి అన్నారు.
* పోలవరంపై పట్టుబట్టాలి.. ఎంపీలకు సీఎం జగన్ మార్గ నిర్దేశం సవరించిన అంచనా వ్యయం రూ.55,657 కోట్లను ఆమోదించేలా ఒత్తిడి తేవాలి జాతీయ ప్రాజెక్టు అంటే విద్యుత్తు, సాగునీరు, తాగునీరు అంశాల కలయిక ఇంకా ఆమోదించాల్సిన డిజైన్లూ ఉన్నాయి ఇబ్బందులున్నా రూ.2,104 కోట్లు ఖర్చు చేస్తే రీయింబర్స్ కాలేదు ఏపీకి రెవెన్యూ లోటు భర్తీని ప్రస్తావించాలి గత సర్కారు నిర్వాకాలకు రుణ పరిమితిని కత్తిరించడంపై ప్రశ్నించాలి.
అమరావతి :
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.55,657 కోట్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించేలా పార్లమెంట్ సమావేశాల్లో పట్టుబట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. జాతీయ హోదా ప్రాజెక్టు అంటే విద్యుత్తు, సాగునీరు, తాగునీరు అంశాల కలయికని, అయితే ఎప్పుడూ లేనివిధంగా తాగునీటి అంశాన్ని విడదీసి చూస్తున్నారని పేర్కొన్నారు.
కాంపొనెంట్ వారీగా డబ్బులిస్తామని చెబుతున్నారని, కేంద్రం ఇంకా ఆమోదించాల్సిన డిజైన్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇబ్బందికర పరిస్థితులున్నప్పటికీ పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,104 కోట్లు ఖర్చు చేసిందని, అయితే ఆ డబ్బులను కేంద్రం ఇంకా రీయింబర్స్ చేయలేదన్నారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన పలు అంశాలపై ఎంపీలకు సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పేదరికం ఎక్కువగా ఉందనే కోణంలో గణాంకాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇది వాస్తవ విరుద్ధం. ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తలసరి ఆదాయం చాలా తక్కువ.
ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి రూ.1,703 కోట్ల బకాయిలు రావాలి. రాష్ట్ర విభజన తర్వాత మన విద్యుత్ తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 6,112 కోట్ల బకాయి పడింది. వీటిని ఇప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
రాష్ట్ర విభజన సమయంలో రీసోర్స్ గ్యాప్ (రెవెన్యూ లోటు) రూ.22,948.76 కోట్లు అయితే ఇచ్చింది రూ.4,117.89 కోట్లు మాత్రమే. రీసోర్స్ గ్యాప్‌ను 2014–15 బడ్జెట్ ద్వారా పూడుస్తామని చెప్పారు. కాగ్ ప్రకారం గ్యాప్ విలువ రూ.16,078.76 కోట్లు కాగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్ లాంటి బకాయిలతో కలిపి లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది.
ఓవర్ బారోయింగ్ పేరుతో రుణాలు కత్తిరించడం అన్నది ఎప్పుడూ లేదు. చంద్రబాబు హయాంలో చేసిన దానికి రుణాల్లో కత్తిరింపులకు దిగడం సరికాదు. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణం సేకరించిందని తెలిసినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదు? రుణాలను ఇప్పుడు ప్రభుత్వం సక్రమంగా తీరుస్తోంది. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు.
వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. బీసీ కులాల వారీగా జనాభా లెక్కించేలా ఒత్తిడి తేవాలి.
ఉపాధిహామీ కింద రాష్ట్రానికి రూ.4,976.51 కోట్ల బకాయిలు చెల్లించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశాం. ప్రత్యామ్నాయాలను కూడా సూచించాం. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా 13 కాలేజీలకు అనుమతి రావాలి. పేదల ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరాం. దిశ బిల్లు ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరాలి. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతలకు మన పార్టీ తరఫున మద్దతు పలకాలి.
మనది ప్రజల కూటమి..
‘‘మన ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచింది. మరో రెండేళ్ల తర్వాత ఎన్నికల కాలం వచ్చేస్తుంది. మన పార్టీకి అంటూ ఒక సిద్ధాంతం ఉంది. మనకంటూ సొంత బలం ఉంది. మనం ఏ కూటమిలోనూ లేం. ఎవరి తరఫునా లేం. మనది ప్రజల కూటమి. మనం ప్రస్తావించే ప్రతి అంశం కూడా ప్రజల తరఫునే. మనం వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ప్రజలకు మేలు జరిగే ఏ అంశం కోసమైనా మనం ముందడుగు వేయాలి. ఎంపీలు అంతా కలసికట్టుగా ముందుకు సాగాలి. సమష్టిగా రాష్ట్రం కోసం పనిచేయాలి. మనకంటూ బలం ఉంది. మన పార్టీకి ప్రతిష్ట ఉంది. ఆ ప్రతిష్టను నిలబెట్టేలా ప్రతి క్షణం ప్రజల కోసం పాటుపడాలి. ప్రజలకు మేలు జరిగే అంశాల్లో మనం ముందుకు అడుగు వేయాలి’’ – వైఎస్సార్ సీపీ ఎంపీలతో సీఎం జగన్.
* తిరుపతి :
సత్యనారాయణ పురం పాఠశాలలోని హెడ్ మాస్టర్ పై టీచర్ దాడి .
సత్యనారాయణ పురం ప్రాథమిక పాఠశాలలోహెడ్ మాస్టర్ పై టీచర్ దాడి .
స్కూలుకు రాని టీచర్ ను హెడ్ మాస్టర్ ప్రశ్నించి ,పై అధికారులకు ఫిర్యాదుచేసినందుకు.
స్కూలుకు రాని శ్రీకాకుళం ఉన్న విద్యార్థికి అటెండెన్స్ వేస్తున్న నందుకు.
బై భ్రాంతులకు గురైన ప్రధానోపాధ్యాయుడు నన్ను ఎక్కడ కన్నా మార్చేయండి అంటూ ఆవేదన.
పాఠశాలలోని తరగతి గదిలో పడక, మద్యం బాటిళ్లు, గ్లాసులు లభ్యం.
ఆ ఉపాధ్యాయురాలు మాకొద్దు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సహా సహచర ఉపాధ్యాయులు.
* సాగు చట్టాలు రద్దు చేసిన తర్వాత కూడా నిరసనలెందుకన్న తోమర్
దిల్లీ:
రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. దానికింద పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర వంటి పలు సమస్యలపై చర్చించనున్నారు. ఈ కమిటీలో రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా భాగమవుతారని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
‘రైతు సమస్యలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం వంటి పలు అంశాలపై ఆ కమిటీ చర్చించనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత కూడా రైతులు నిరసనలు కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదు. వారంతా తమ ఆందోళనను విరమించుకొని ఇంటికి వెళ్లాలని నేను కోరుతున్నాను’ అని తోమర్ మీడియాతో వెల్లడించారు. మరోపక్క నిరసనల్లో భాగంగా రైతులపై పెట్టిన కేసులు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని మంత్రి అన్నారు. వాటి ఉపసంహరణపై రాష్ట్రాలదే నిర్ణయమన్నారు.
గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. రైతులు నిరసన తెలుపుతున్న క్రమంలో పలు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే చట్టాలతో తమకు కనీస మద్దతు ధర భరోసా ఉండదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో తమ నిరసనను మరింత ఉద్ధృతం చేయాలనే ఆలోచనలో ఉండగా. ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం కొద్ది రోజుల క్రితం ప్రకటన చేసింది. అలాగే సోమవారం ప్రారంభం కానున్న శీతకాల సమావేశాల్లో మొదటిరోజే వాటి రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
* నరేంద్ర మోదీ: ఒమిక్రాన్ కలవరం మోదీ కీలక భేటీ దిల్లీ:
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త రకంపై సమీక్షలు చేపడుతున్నట్లు ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో శనివారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ జరగనుందని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై మోదీ ఈ సమావేశంలో సమీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దాని పొరుగుదేశాలకూ వ్యాపించింది. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని. వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ వేరియంట్‌ను ఆందోళనకర రకంగా వర్గీకరించింది. దీనిపై యావత్ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు కొత్త వేరియంట్‌పై భారత్ అప్రమత్తమైంది. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విస్తృత స్క్రీనింగ్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ఇప్పటివరకు భారత్‌లో కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది.