DailyDose

TNI నేటి నేర వార్తలు 2-Dec-2021

TNI నేటి నేర వార్తలు 2-Dec-2021

* కర్నూలు జిల్లా ఆదోని పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మమ్మ ఆర్చ్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా స్కార్పియో వాహనంలో మద్యం తరలిస్తున్న వ్యక్తులను అనుమానస్పదంగా ఉండడంతో వాహనాన్ని తనిఖీ చేయగ అందులో భారీగా కర్ణాటక మధ్య ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి సుమారు 50 బాక్సులు 4800 టెట్రా ప్యాకెట్లు మరియు స్కార్పియో కారుతో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక మద్యం విలువ సుమారు కర్ణాటకలో మూడు లక్షలు ఉంటుందని ఇది ఆంధ్రాలో అమ్మితే ఆరు లక్షల విలువ చేస్తుందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు, ఈ కార్యక్రమంలో రెండవ పట్టణ సీఐ శ్రీరాములు ,ఎస్సై హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.

* వరి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో తుఫాను కారణంగా దెబ్బతిన్న తడిసిన ధాన్యాన్ని, వరి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గిట్టుబాటు ధరలు కల్పించాలని, అఖిల భారత రైతు సంఘం, AIKMS మరియు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు గిట్టుబాటు ధరలు, ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమయంలోనే తుఫాను కారణంగా పంటలు తడిసిపోయి రైతులు తీవ్ర నష్టానికి లోనయ్యారని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి అన్నారు. మొత్తం వరి పంట కు మద్దతు ధర కల్పించి గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అన్నారు. భారీ వర్షాల కారణంగా పొగాకు, మొక్కజొన్న, మిరప తదితర పంటలు నష్టపోయారని, భారీ వర్షాల సమయంలో పాడైన పంటలకు ఉచితంగా విత్తనాలు ఎరువులు సరఫరా చేయాలి అన్నారు. వ్యవసాయ రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం తాసిల్దారు కి వినతిపత్రం ఇచ్చారు. ముందుగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

* భారత్ లో ఎంట్రీ ఇచ్చిన ఓమిక్రాన్.

కర్ణాటకలో 2 ఓమిక్రాన్ కేసులు నమోదు.

దృవీకరించిన కేంద్ర ఆరోగ్య శాఖ.

ఇప్పటివరకు 29 దేశాలలో 373 కేసులు.

* కృష్ణాజిల్లా:

విస్సన్నపేట తహశీల్దారు ఆఫీసు ముందు
వి.ఆర్.ఓ ల నిరసన

మంత్రి అప్పలరాజు వి.ఆర్.ఓలపై చెసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన వి.ఆర్.ఓలు.

* హైదరాబాద్:

బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ,జినోమ్ సీక్వెన్స్ కోసం పరీక్షలు నిర్వహిస్తున్నాం: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్.

* ఒమిక్రాన్ ఎఫెక్ట్. మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ. 1,000 జ‌రిమానా

ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే 24 దేశాల‌కు విస్త‌రించిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 ఏండ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మాస్కు ధ‌రించ‌క‌పోతే నేటి నుంచి పోలీసులు రూ.వెయ్యి జ‌రిమానా విధిస్తార‌ని తేల్చిచెప్పారు. మాస్కు ధ‌రించ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

ముప్పు ఎప్పుడైనా రావొచ్చు ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ క‌ట్ట‌డిపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా చ‌ర్చించామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాలి. త‌ప్ప‌నిస‌రిగా అంద‌రూ కొవిడ్ టీకా రెండు డోసుల తీసుకోవాలి. ఒమిక్రాన్ నివార‌ణ‌కు మ‌న వంతు ప్ర‌య‌త్నం చేయాలి. జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే ఇప్పుడు జ‌రుగుతున్న అస‌త్య ప్ర‌చారాలే వాస్త‌వాల‌వుతాయి. ముప్పు ఎప్పుడైనా వ‌చ్చే అవ‌కాశం ఉంది అని శ్రీనివాస్ రావు హెచ్చ‌రించారు.

* కృష్ణా ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్.

బుధవారం రాత్రి గుంటుపల్లి గ్రామంలో ఒక అపార్ట్మెంట్ లో దోపిడీకి ప్రయత్నించిన ఐదుగురు చెడ్డి గ్యాంగ్ దొంగలు.

అలికిడి వినిపించి లైట్లు వేయటం తో పరారైన దొంగలు.

CC ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు.

* కల్లాల్లో రైతులు క్యాంపుల్లో మంత్రులు:-
షర్మిల హైదరాబాద్‌: మంత్రులపై వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో రైతులు. క్యాంపుల్లో మంత్రులు ఉన్నారని షర్మిల పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రిసార్టుల్లో జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. వడ్ల కొనుగోళ్ల జాప్యంతో రైతులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ప్రాణాలకంటే అధికారమే ముఖ్యమనే విధంగా మంత్రుల తీరు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు.