ScienceAndTech

తుఫానులు ఎలా ఏర్పడతాయి

తుఫానులు ఎలా ఏర్పడతాయి

తుఫాన్‌ ఎలా ఏర్పడుతుంది?

అక్టోబరు – నవంబరు నెలలు వచ్చే సరికి తుఫాన్లు వస్తాయేమోనన్న భయం మన రాస్ట్రములో ఉంటుంది. అతి వేగముతో గాలులు, భారీ వర్షాలు తీవ్రనస్టాన్ని కలిగిస్తాయి. ఇది ప్రతిఏటా జరుగుతునే ఉంటుంది.

భూగోళము మీద అన్నిప్రాంతాలూ ఒకేలా ఉండక ఎత్తుపల్లాలు కల్గిఉన్నట్లే గాలిలో పీడనపరంగా అక్కడక్కడా అల్పపీడనము గల ప్రాంతాలు ఏర్పడతాయి. పల్లపు ప్రాంతాలలోకి నీరు ప్రవహించినట్లే అల్పపీడనము ప్రాంతాలాలోకి అన్నిదిక్కుల నుండి గాలి అతివేగంగా వీస్తుంది. అలా ఏర్పడిన వాయుగుండము సుడులు తురుగుతూ వేగం పుంజుకుని తీరము వైపు పయనిస్తుంది. వాతారణములోని తేమ భూమిపైనున్న చల్లని ప్రదేశాలకు తాకి వర్షముగా కురుస్తుంది. వేగము గా వీచే గాలితోకూడిన వర్షమే తుఫాను.