DailyDose

TNI నేటి తాజా వార్తలు 3-Dec-2021

TNI నేటి తాజా వార్తలు 3-Dec-2021

?️?️?️?️?️?️

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

03-12-21
శుక్రవారం

?️ నిన్న 02-12-2021 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 26,514

?️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య. 13,445

?️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.46 కోట్లు.

?సర్వేజనాః సుఖినోభవంతు ?

* ఏపీలో కొత్త కలకలం. ఇళ్ల ప్లాన్లను సేకరిస్తున్న సచివాలయ సిబ్బంది

ఏం చేస్తున్నారో తెలీదు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. పట్టణాలు నగరాలు అన్న తేడా లేకుండా సచివాలయ సిబ్బంది సేకరిస్తున్న హౌసింగ్ ప్లాన్లు దేనికన్నది అర్థంకాక. ఆందోళన చెందుతున్నారు ఏపీ వాసులు. కొన్ని దశాబ్దాలుగా తాము ఉంటున్న ఇంటికి సంబంధించిన వివరాల్ని సేకరించటంతో పాటు. అద్దె ఆధారిత పన్ను విధానాన్ని మార్చాలన్న యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పన్నులు భారీగా పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఇంటి ప్లాన్లను సేకరిస్తున్నది ఎందుకన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇంటి ప్లాన్లు అడుగుతున్న ప్రభుత్వ సిబ్బందిని అడిగితే తమకు పూర్తి సమాచారం తెలీదని చెప్పటంతో ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

తాజాగా ఏపీ వ్యాప్తంగా పలువురి ఫోన్లకు వస్తున్న సంక్షిప్త సందేశాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ‘మీ ఇంటికి ప్లాన్ ఉందా? ఉంటే దాని కాపీ వార్డు సచివాలయంలో ఇవ్వండి. కాపీ ఇవ్వకపోతే మీ భవనాన్ని అనధికార నిర్మాణంగా పరిగణిస్తాం’ అంటూ వస్తున్న మెసేజ్ ల పరామార్థం ఏమిటన్నది చాలామందికి అర్థం కావట్లేదు. ఇదిలా ఉంటే ఇంటి ప్లాన్లు ఎందుకు అడుగుతున్నారు? ఈ సమాచారాన్ని ఎందుకు సేకరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల్ని అడిగితే వారు చెబుతున్న సమాధానం ఒక పట్టాన అర్థం కావట్లేదు.

‘మీ ఇంటి ప్లాన్ మాకు చూపించండి. మాకు ఇవ్వటం ఇష్టం లేకపోతే వార్డు సచివాలయంలో చూపించొచ్చు. ఇంటికిప్లాన్ ఉందో లేదో నిర్ధారించుకోవటానికి. భవనాన్ని ఎప్పుడు నిర్మించారో తెలుసుకోవటానికే అడుగుతున్నాం’ అంటూ సచివాలయ సిబ్బంది మాటలు ఇప్పుడు కొత్త కలకలంగా మారింది.

ఇదిలా ఉంటే మరి చట్టాలు ఏం చెబుతున్నాయన్నది చూస్తే 1994 మార్చి ఒకటికి ముందు నిర్మించిన భవనాలకు ప్లాన్ లేకున్నా ప్లాన్ అతిక్రమించినా ఫైన్లు లేవు. అదే సమయంలో 1994 మార్చి 1 నుంచి 2007 డిసెంబరు 14 మధ్య నిర్మించిన భవనాలకు 10 శాతం. 2007 డిసెంబరు 15 నుంచి 2013 ఆగస్టు 4 మధ్య నిర్మించిన భవనాలు. నిబంధనలకు విరుద్దంగా ఉంటే 25 వాతం ఫైన్ విధిస్తారు. 2013 ఆగస్టు తర్వాత నిర్మించిన భవనాలకు. ప్లాన్ లో అతిక్రమణలు 10 శాతం వరకు ఉంటే 25 శాతం. 10 శాతం దాటితే 50 శాతం. ప్లాన్ లేకుంటే వంద శాతం ఫైన్ విధిస్తారు. చట్టాలు ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత. ఇంటి ప్లాన్లను ఎందుకు సేకరిస్తున్నారన్నది ఒక పట్టాన అర్థంకావట్లేదు.

* నాణేలు కొన్ని చిహ్నాలను కలిగి ఉంటాయి, తద్వారా అవి ఎక్కడ ముద్రించబడ్డాయో గుర్తించవచ్చు. గుర్తు లేదు అంటే అది కోల్‌కతాలో ముద్రించబడింది, ముంబైకి డైమండ్, నోయిడా కోసం డాట్ మరియు హైదరాబాద్‌కు నక్షత్రం.

* గుంటూరు బ్రేకింగ్:

గుంటూరు సైబర్ నేరాల బారిన పడిన బాధితులు తక్షణం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయాలి.

సైబర్ బారిన పడిన 10కేసుల్లో8లక్షల 44వెల 647బాధితులు మోస పోయారని తెలిసింది.

సైబర్ నేరాల బాధితులకు 5 లక్షల 64వేల 711రూపాయలని బాధితులకు అప్పగించాము.

సైబర్ నేరాల కు సంబందించి రెండు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసాము.

సైబర్ బారిన పడిన కేసుల్లో పోలీసులకు త్వరితగతిన fir చేయాలని చెప్పాం.

గుంటూరు పట్టణ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్పెషల్ డ్రైవ్ చెపడుతున్నాము.

ట్రాఫిక్ సమస్య ఉన్నచోట ట్రాఫిక్ పోలీసులు 24×7విధులు నిరహించబోతున్నారు.

వాసవి నగర్ ,వస్త్ర నగర్ ,స్వర్ణ భారత్ నగర్,రామి రెడ్డి తోట సమస్య త్మక ప్రాంతాలు గా గుర్తించాం.

సమస్య త్మక ప్రాంతాల్లో దృష్టి సారిస్తున్నాము.

* నవరత్నాలను నమ్మి ఇప్పుడు నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు: చంద్రబాబు

అమరావతి: ఏపీప్రజలు నవరత్నాలను నమ్మి ఇప్పుడు నవగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

శుక్రవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ‘ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ. దివ్యాంగుడైన కోటేశ్వరరావు ఎన్టీఆర్‌కు, తనకు పైలట్‌గా ఉండేవారని చెప్పుకొచ్చారు. ప్రతి టూర్‌లో కోటేశ్వరరావు ముందు వెళ్లేవారన్నారు. దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లక్షల మందికి సాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు.

ఆ బాధ్యత నేను తీసుకుంటా.

‘విభిన్న ప్రతిభావంతులకు రూ.500 ఉండే పెన్షన్ 3 వేలు చేశాం. ఎప్పుడో ఎన్టీఆర్ కట్టిన ఇంటికి ఇప్పుడు జగన్ పట్టా ఇస్తాను అంటున్నాడు. డ్వాక్రా మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. రాజ్యాంగం ఇంకా బతికే ఉంది. తప్పును ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత కమిషన్ వేయడం ఖాయం.. ఇప్పుడు తప్పు చేసిన వారిపై అప్పుడు చర్యలు తప్పవు. రాక్షస జాతిలా ఈ ప్రభుత్వం ప్రజలను పీల్చుకుతింటోంది. చట్ట సభలకు దివ్యాంలను పంపే బాధ్యత నేను తీసుకుంటా!. దివ్యాగులకు రిజర్వేషన్‌లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

* హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిదికి హైదరాబాద్‌ రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఈ నెల 20న నగరానికి వస్తున్నారు నాలుగు రోజులపాటు రాష్ట్రపతి నిలయంలో ఉంటారు. దీంతో రాష్ట్రపతి నిలయంలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో ఆయా విభాగాల అధికారులు నిమగ్నులయ్యారు. రాష్ట్రపతి నిలయాన్ని ఆనుకొని ఉన్న ఈఎంఈ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రత్యేక హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. ప్రథమ పౌరుని పర్యటన సందర్భంగా ఆక్టోపస్‌ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.

* Parliament Winter Session ఐదో రోజు ప్రారంభం పార్లమెంట్‌ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ శుక్రవారం ప్రారంభమయ్యాయి.

► 12 సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విపక్ష సభ్యులు పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద మరోసారి నిరసన చేపట్టారు అయితే, వారికి కౌంటర్‌గా బీజేపీ సభ్యులు కూడా అదే ప్రాంతంలో నిరసనకు దిగారు.

► లఖింపూర్‌ ఖేరీ ఘటనపై, కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్‌కుమార్‌ మిశ్రా తొలగింపు అంశంపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఐదో రోజు ఉభయ సభలు కొలువుదీరాయి. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సవరణ) బిల్లు 2021, ఢిల్లీలో ప్రత్యేక పోలీసు వ్యవస్థ ఏర్పాటు (సవరణ) బిల్లు 2021, జాతీయ ఫార్మాస్యూటికల్‌ విద్య మరియు పరిశోధన (సవరణ) బిల్లు 2021 నేడు లోక్‌సభ ముందుకు రానున్నాయి. ఇక 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ సభలో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే డ్యామ్‌ సేఫ్టి బిల్లు 2019ను రాజ్యసభ గురువారం ఆమోదించింది.

* కేబీయార్ పార్కులో ఘనంగా పీకాక్ ఫెస్టివల్

పెద్ద సంఖ్యలో హాజరైన ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు

అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యతపై పిల్లలకు అవగాహన, డ్రాయింగ్, పెయిటింగ్, స్నేక్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు

హైదరాబాద్ నగరానికి ప్రకృతి మణిహారంగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీయార్ పార్క్)లో ఘనంగా నెమలి దినోత్సవం (పీకాక్ ఫెస్టివల్) జరిగింది. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున (3 డిసెంబర్ 1998లో) కేంద్ర ప్రభుత్వం కేబీయార్ పార్కును జాతీయ ఉద్యానవనంగా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. సుమారు 360 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష జంతు జాతులు ఉండటంతో, వాటిని పరిరక్షించటంలో భాగంగా నేషనల్ పార్కుగా ప్రకటించారు. అలాగే ఇక్కడ ఉన్న జంతువులు, పక్షి జాతుల్లో ఎక్కువగా జాతీయ పక్షిగా గుర్తించిన నెమలి ఉండటంతో, కేబీయార్ జాతీయ ఉద్యానవనం ఏర్పాటుకు గుర్తుగా ప్రతీయేటా డిసెంబర్ 3న అటవీ శాఖ పీకాక్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.

ఈ పార్కుకు వచ్చే సందర్శకులకు, వాకర్స్ కు ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ విరివిగా కనిపించే నెమళ్లే. ఈ యేడు జంతుగణనలో ఐదు వందలకు పైగా నెమళ్లు కేబీయార్ పార్కులో ఉన్నట్లు నమోదు అయింది. వీటి సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా చిన్న పిల్లల్లో అడవులు, వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అటవీ శాఖ ప్రతీ యేటా నిర్వహిస్తోంది. వివిధ స్కూళ్ల నుంచి వందలాది మంది పిల్లలు ఈసారి పికాక్ ఫెస్టివల్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో కోవిద్ జాగ్రత్తలు తీసుకుంటూ పాల్గొన్నారు.

ఫ్రెండ్న్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు నిర్వహించిన స్నేక్ షో లు వివిధ రకాల పాములు, అవి వ్యవహరించే తీరును పిల్లలకు వివరించారు. అలాగే అడవులు, జంతువులకు సంబంధించిన డ్రాయింగ్, పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు అటవీ శాఖ అధికారులు బహుమతులను అందించారు. స్కూలు పిల్లలు పర్యావరణ అంబాసిడర్లుగా వ్యవహరించాలని, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మనుగడ అని గుర్తించాలని కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు.

ప్రతీ ఒక్కరిలో పర్యావరణ స్ఫృహ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అర్బన్ ఫారెస్ట్ పార్కులను (109) అభివృద్ది చేస్తోందని గుర్తు చేశారు. స్కూలు పిల్లలకు వారి రెగ్యులర్ సిలబస్ తో పాటు పర్యావరణం, జంతు సంరక్షణపై టీచర్లు అవగాహన కల్పించాలని హాజరైన టీచర్లను పీసీసీఎఫ్ ప్రత్యేకంగా కోరారు.

కార్యక్రమంలో పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు సిద్దానంద్ కుక్రేటీ, పర్గెయిన్, వినయ్ కుమార్, ఏ.కే. సిన్హా, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్, డీఎఫ్ఓ జోజి, ఓఎస్డీ శంకరన్, రేంజ్ ఆఫీసర్ అనురాధ, ఇతర అధికారులు, సిబ్బందితో పాటు వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు, టీచర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, కేబీయార్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

* ప్రెస్ రిలీజ్ – ప్లీజ్ క్యారీ

జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి వికలాంగుల కమిషన్ ను ఏర్పాటు చేయాలి

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో వికలాంగుల ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.

వికలాంగుల కోసం జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి వికలాంగుల కమిషన్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నెక్లెస్ రోడ్ లో వికలాంగుల ర్యాలీని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి వికలాంగుల కమిషన్ లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ కు ఇటీవల తాను లేఖ రాశానని, ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉన్నట్లుగానే వికలాంగులకు కూడా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిషన్లు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాష్ట్రంలో 4 లక్షల 90 వేల 630 మంది వికలాంగులకు ప్రతి నెల రూ. 3,016 చొప్పున పెన్షన్లు ఇస్తున్నాం అని వినోద్ కుమార్ తెలిపారు.

వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. వికలాంగులకు ద్విచక్ర వాహనాలను అందించిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు.

శారీరక వైకల్యం కలిగినప్పటికీ వికలాంగులు ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో గొప్పగా రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సివిల్, స్టేట్ సర్వీస్, రాజకీయాలు, వైద్యం, న్యాయం, విజ్ఞాన రంగం వంటి అనేక రంగాల్లో వికలాంగులు గొప్పగా తమ ప్రావీణ్యాన్ని చాటుకుంటున్నారని ఆయన వివరించారు.

వికలాంగులకు మరింత ప్రోత్సాహకాలు అందిస్తే. వారు మరింత గొప్పగా తమ ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్తారని ఆయన అన్నారు.

వికలాంగులకు చట్టపరంగా, సామాజికంగా రక్షణ ఉండాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

వికలాంగులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరిన్ని రిజర్వేషన్లు కల్పించి ప్రాధాన్యతను ఇవ్వాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, దైవజ్ఞ శర్మ, వికలాంగుల హక్కుల వేదిక చైర్మన్ కొల్లి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

* పత్రికాప్రకటన
03.12.2021

సినిమా టికెట్ ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ(చిన్నబాబు), సునీల్ నారంగ్, DVV దానయ్య, రాధాకృష్ణ, RRR డైరెక్టర్ రాజమౌళి, భీమ్లా నాయక్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పుష్ప ప్రొడ్యూసర్ నవీన్, వంశీ, బాలగోవింద రాజు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తదితరులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియా తో మాట్లాడుతూ లక్షలాది మంది ఉపాధి పొందే చిత్ర పరిశ్రమ గడిచిన 2 సంవత్సరాల నుండి కరోనా తో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, ఇప్పుడిప్పుడే తిరిగి తేరుకుంటుందని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమని చెప్పారు. థియేటర్ ల యాజమాన్యాలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో పుష్ప, RRR, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్ లో నిర్మించిన చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు సినిమా నిర్మాణ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని, థియేటర్ ల నిర్వహణ ఖర్చు గతంలో కన్నా అనేక రెట్లు పెరిగిందని వివరించారు. కరోనా వల్ల సుమారు 2 సంవత్సరాలకు పైగా పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకపోయిందని, ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని, తెలియజేస్తూ టికెట్ ధరల పెంపుపై ఒక తుది నిర్ణయం తీసుకొని ధరలను పెంచి సినీమారంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలలో అమలు అవుతున్న టికెట్ ల ధరల పై అధ్యయనం చేసి ఎగ్జిబిటర్ లకు కానీ, నిర్మాతలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో FDC ED కిషోర్ బాబు తదితరులు ఉన్నారు.

* చంద్రబాబునాయుడును కలిసిన సర్పంచ్ ల సంఘం ప్రతినిధులు పంచాయితీల నిర్వీర్యంపై తెలుగుదేశం పార్టీ అలు పెరగని పోరు
వ్యక్తులకన్నా వ్యవస్థలే ముఖ్యం నిధులు, అధికారాల కోసం సర్పంచ్ ల సంఘం పోరాటానికి టిడిపి సంఘీభావం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు

రాష్ట్రంలో ఎక్కువమంది వైసిపి మద్దతుదారులే సర్పంచ్ లుగా ఉన్నప్పటికీ పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ జగన్ రెడ్డి చేపడుతున్న చర్యలపై తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోందని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నాడు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ప్రతినిధులు చంద్రబాబును కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ టిడిపి సర్పంచ్ లు మెజారిటీ స్థానాల్లో లేనప్పటికీ వ్యక్తులకన్నా వ్యవస్థలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి గతంలో జిఓ నెం.2, ఆర్థిక సంఘ నిధులు, వివిధ అంశాలపై పోరాటం చేశామని అన్నారు.

73వ రాజ్యాంగ సవరణలో పంచాయితీలకు ప్రత్యేక అధికారాలిచ్చారని, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ఆ అధికారాలను కాలరాస్తోందని అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో వైసిపి అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్ ల సంఘం అనేక పోరాటాలు చేసింది, నిధులు, అధికారాల కోసం వారు చేసే న్యాయపోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున నిధులు ఇచ్చి, పంచాయితీలను అభివృద్ధి చేశామని తెలిపారు. దేశానికి ప్రధాని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో పంచాయితీకి సర్పంచ్ కి అలాంటి అధికారాలే ఉంటాయి, గతంలో సర్పంచ్ లకు చెక్ పవర్ తోపాటు ప్రత్యేక అధికారాలు ఇచ్చాం, గ్రామాల్లో రాజకీయాలకంటే అభివృద్ధి ముఖ్యమని భావించి పలు చర్యలు చేపట్టామని అన్నారు.

రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వైవిబి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులు రూ.6వేల కోట్లు పంచాయితీలకు ఇవ్వకుండా మళ్లించారని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్పంచ్ ల అధికారాలను కాలరాస్తున్నారని అన్నారు. నరేగా నిధులు గతంలో గ్రామసభ, గ్రామసర్పంచ్ పరిధిలో ఖర్చుచేయడం జరిగేది. నేడు ఆ అధికారం కూడా సర్పంచ్ కి లేకుండా చేశారు. కేవలం సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చే కార్యక్రమం చేస్తున్నారని వైవిబి మండిపడ్డారు.
రాష్ట్ర శాసనసభ మాజీ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ 2014 నుంచి 19వరకు గ్రామ పంచాయితీలకు స్వర్ణ యుగమని, గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి తెలుగుదేశం హయాంలో జరిగిందన్నారు. నరేగా, ఆర్థిక సంఘం, కన్వర్జెన్సీ ద్వారా పెద్దఎత్తున పనులు చేపట్టామని అన్నారు. కానీ, నేడు అభివృద్ధి పూర్తిగా నిలచిపోయిందని, కనీసం పనులు చేసిన వారికి బిల్లులు కూడా చెల్లించడం లేదని అన్నారు.

తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్ డి విభాగం చైర్మన్ బి.రామాంజనేయులు మాట్లాడుతూ గతంలో నరేగా నిధులు వినియోగించకపోవడం వల్ల మురిగిపోయేవని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నిధులపై ప్రత్యేక శ్రద్ధవహించి దేశంలోనే మొట్టమొదటి సారిగా కన్వర్జెన్సీ విధానాన్ని తీసుకువచ్చి పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఈ విధానం దేశానికే ఆదర్శంగా నిలచిందని అన్నారు.
రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు పమిడి వెంకట్రావు మాట్లాడుతూ పంచాయితీల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం, నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచ్ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు అందరం కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం నాయకులు ముల్లంగి రామకృష్ణ, ప్రతాపరెడ్డి, గేదెల రాజారావు, ఇస్మాయిల్, పఠాన్ ఖాదర్ ఖాన్, సుమిత్ర, సుబ్బరామయ్య, కర్రోతు సత్య పాల్గొన్నారు.

* హెబ్రోన్ చర్చ్ వద్ద ఉద్రిక్తత.

సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ట్రస్ట్ సభ్యుల ఆందోళన.

అడ్డుకున్న సొసైటీ సభ్యులు.

భారీగా పోలీసులు మోహరింపు.

ఇరువురు మధ్య తోపులాట.

కోర్ట్ తీర్పు ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ట్రస్ట్ సభ్యులు.

* బ్రేకింగ్:- చంచల్ గూడ జైలు నుండి శిల్పా చౌదరి ని కస్టడీ లోకి తీసుకున్న నార్సింగి పోలీసులు.

* తెల్లాపూర్ , విద్యుత్ నగర్ లో కుటుంబం ఆత్మహత్య.

భార్య భర్త ఇద్దరు పిల్లలు కలిసి సూసైడ్.

భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడి భార్య బయటికి వెళ్లడంతో భర్త మనస్తాపంతో ఇంట్లో ఆత్మహత్య.

భర్త ఉరివేసుకున్న సమాచారం భార్యకు తెలియడంతో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జోగిపేట ఆందోల్ చెరువులో ఆత్మహత్య.

ఈ భార్య భర్తల ఆత్మహత్యకు భర్త అప్పులు చేయడంతో భార్య ఎందుకు అప్పులు చేస్తున్నావు అని అడిగినందుకు ఇద్దరు గొడవ భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

* As per media query relating to Press Release dated 03.12.2021(CBI REGISTERS TWO SEPARATE CASES AGAINST PRIVATE COMPANIES & OTHERS ON THE ALLEGATIONS OF BANK FRAUD OF RS.70 CRORE(APPROX), AND CONDUCTS SEARCHES)

Name of the accused:-

(A) FIRST CASE

(i) M/s Nandi Grain Derivatives Pvt. Ltd., Hyderabad
(ii) Shri V.Suresh Kumar Sastry, Director, M/s Nandi Grain Derivatives Pvt. Ltd
(iii) Shri Sreedhar Reddy Sajjala, Director, M/s Nandi Grain Derivatives Pvt. Ltd
(iv) Shri Sashi Reddy, Guarantor
(v) M/s SPY Agro Industries Ltd, Nandyal and unknown others.

(B) SECOND CASE

(i) Sh. Undavalli Raja Gopal, Private person(Partner of M/s Prithviram Infra, Hyderabad)
(ii) Sh. Boppudi Seshagiri Rao, Private Person (Partner of M/s Prithviram Infra, Hyderabad)
(iii) M/s Prithviram Infra, Hyderabad(Borrower Firm)
(iv) M/s Naveha Enviro Engineers & Consultants, Hyderabad
(v) M/s Lorven Green Energy Projects Private Ltd., Hyderabad
(vi) Sh. Chandra Prakash, Private Person and unknown others.

* www.cbi.gov.in
CENTRAL BUREAU OF INVESTIGATION
(INFORMATION SECTION)
5-B, CGO COMPLEX, LODHI ROAD
NEW DELHI-110003

CBI REGISTERS TWO SEPARATE CASES AGAINST PRIVATE COMPANIES & OTHERS ON THE ALLEGATIONS OF BANK FRAUD OF RS.70 CRORE(APPROX), AND CONDUCTS SEARCHES

The Central Bureau of Investigation has registered a case against five accused including Hyderabad (Telangana) based private company & its two Directors; a Guarantor; another private company based at Nandyal; unknown public servant(s)/private person(s). It has been alleged that the private company based at Hyderabad represented by its Directors entered into a conspiracy with others & availed loans from Bank of Baroda, Banjara Hills Branch, Hyderabad and later diverted the loan funds for other than the purpose for which the loan was given & also for personal gains. It has been further alleged that the accused submitted false stock statements to bank for concealing their irregularities, falsified their books of accounts and willfully defaulted in repayments. An alleged loss to the tune of Rs.61.86 crore(approx) was caused to Bank.

Searches, in this case, were conducted at 6 places including at Hyderabad, Nandyal, Kurnool which led to recovery of several incriminating documents.

The other case was registered against six accused including 3 private companies based at Hyderabad, private persons(Partners of the borrower private firm); MD of Bank Valuer Firm & unknown public servants/private persons. It was alleged that the private company based at Hyderabad had availed secured over draft facility of Rs.4 crore and LC of Rs.2 crore with total limit of Rs.6 crore on 26.10.2016 for business purpose from Union Bank of India (Earlier Andhra Bank), Defence Colony, Hyderabad. It was further alleged that after availing the loan, the company committed default in repayment of loan in violation of the terms of loan agreement and account slipped into Non-Performing Assets(NPA) on 30.11.2018. Bank declared the account as fraud on 30.09.2019 and reported to RBI on 19.10.2019. It was also alleged that the borrowers had diverted & misappropriated the borrowed funds and also mortgaged disputed, unidentified property. An alleged loss of Rs.8.15 crore(approx) was caused to Bank.

Searches, in this case, were conducted at the premises of accused which led to recovery of several incriminating documents.

Investigation in both the cases is continuing.