అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర తెలుగు సంస్థ WATS (వాషింగ్టన్ తెలుగు సమితి) 2022 అధ్యక్షుడిగా శ్రీనివాస్ అబ్బూరి బాధ్యతలు చేపట్టారు. 2016లో సంస్థలోకి ప్రవేసించిన్ ఆయన సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందారు. ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. కోవిడ్ సమయంలో వాషింగ్టన్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు ఆన్ లైన్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని ప్రవాస హిత కార్యక్రమాలు చేపడతానని ఆయన తెలిపారు. ఆయనకు ప్రవాసులు అభినందనలు అందజేశారు. శ్రీనివాస్ కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా దొడ్డా జయపాల్‌రెడ్డి, కార్యదర్శిగా కొత్తపల్లి సునీతలు వ్యవహరిస్తారు.
WATS అధ్యక్షుడిగా అబ్బూరి శ్రీనివాస్
Related tags :