DailyDose

TNI వాణిజ్య వార్తలు

TNI  వాణిజ్య వార్తలు

* నోటీస్ పీరియడ్ లేకుండా జాబ్ మానేస్తే జీఎసీ!

• తీర్పిచ్చిన ఏఏఆర్
• శాలరీపై 18 శాతం వరకు ఉండే ఛాన్స్
• వచ్చే ఏడాదిలోపు పూర్తి స్థాయిలో జాబ్ డేటా

బిజినెస్ డెస్క్, వెలుగు:
జాబ్ మానేయాలనుకుం టున్నారా ? తప్పులేదు. కానీ, నోటీస్ పీరియలో పనిచేయకుండా సడెన్‌గా మానేస్తే మాత్రం ట్యాక్స్ కట్టాల్సిందే. అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) ఇటువంటి ఉద్యోగుల జాబ్ బెనిఫిట్స్ప జీఎస్టీ వేయొచ్చని తీర్పిచ్చింది. జాబ్ చేస్తున్న ప్పుడు కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు కొన్ని బెనిఫిట్స్న ఇస్తాయి. గ్రూప్ ఇన్సూరెన్స్, టెలిఫోన్ రీఛార్లు, నోటీస్ పీరియడ్లో ఇచ్చే శాలరీ వంటివి ఇస్తుంటాయి. కానీ, నోటీ ఇవ్వ కపోతే మాత్రం ఎంప్లాయ్ కు చెల్లించే శాలరీలో కొన్ని ఖర్చులను కట్ చేస్తాయి. అంటే టెలిఫోన్ బిల్లులు, గ్రూప్ ఇన్సూరెన్స్ ఖర్చులు వంటివి. వీటిపై జీఎస్టీ వేయొచ్చని ఏఏఆర్ ప్రకటిం చింది.

సింపుల్ గా చెప్పాలంటే నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా మానేస్తే, ఉద్యోగికి చెల్లించే మంతీ శాలరీపై జీఎస్స్ వేయడానికి వీలుంటుంది. కాగా, జీఎసీ చట్టం ప్రకారం, ఎంప్లాయిమెంట్ టైమ్ లో ఎంప్లాయర్ ఉద్యోగికి చెల్లించే శాలరీలపై ఎటువంటి జీఎస్టీ ఉండదు. నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా మానేస్తే ఉద్యోగులపై జీఎస్టీ వసూలు చేసే బాధ్యత ఎంప్లాయర్ పై ఉంటుంది. రివర్స్ చేంజ్ మెకానిజం (కంపెనీలపై కాకుండా డైరెక్ట్ గా ఉద్యోగిపై) ద్వారా ఉద్యోగి రికవరీలపై జీఎనీ వేస్తారు. అంటే నోటీస్ పీరియడ్ లో పనిచేయకపోతే జీఎనీ కట్టమని ఉద్యోగిని ఎంప్లాయర్ అడగొచ్చని ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ అన్నారు. ఈ జీఎసీ 18 శాతం ఉండొచ్చని చెప్పారు. సాధారణంగా నోటీస్ పీరియడ్ నెల నుంచి మూడు నెలల వరకు ఉంటోంది.

* జాబ్ డేటాపై ఫుల్ కసరత్తు….

ఇన్ఫార్మల్ సెక్టార్‌లో పనిచేస్తున్న వర్కర్ల డేటాను ప్రభుత్వం వేగంగా సేకరిస్తోంది. జాబ్ డేటా చేతిలో ఉంటే ఉద్యోగాలను
క్రియేట్ చేయడంలో సరియైన పాలసీలను తీసుకోవడానికి వీలుంటుందని భావిస్తోంది. ఈ జాబ్ డేటాను వలస కూలీలను, లేబర ర్లను సర్వే చేయడం ద్వారా సేకరిస్తోంది. దీనికి తోడు కొత్తగా తెచ్చిన ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఇన్ఫర్నేషను ప్రభుత్వం సేకరిస్తోంది కరోనా లా డౌన్ టైమ్ లో వేల మంది వలస కూలీలు తమ సొంత ఊళ్లకు తిరిగి వెళ్లిపో యారు. దీంతో చాలా సిటీలలో లేబర్ షార్టేజ్ ఏర్పడింది. ప్రభుత్వ ప్రోగ్రామ్ లు కూడా సరిగ్గా జరగలేదు. ఈ సంఘటన తర్వాత వర్కర్ల ఇన్ఫర్మేషనన్ను సేకరించడం చాలా కీలకంగా మారిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాకు కాలం చెల్లింద ని చెబుతున్నారు.

సర్వే ద్వారా సేకరించిన జాబ్ డేటాపై ఆధారపడాలని ఆర్థిక వేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తాజాగా ప్రభు త్వం ఈ-శ్రమ్ పేరుతో ఓ ఆన్లైన్ పోర్టలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు 10 కోట్ల మార్క్ ను టచ్ చేశాయి. మరో 28 కోట్ల మంది లేబర్లు రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఫార్మల్ సెక్టార్‌లో పనిచేస్తు న్నవారిలో మెజార్టీ ఉద్యోగుల డేటా ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంటోంది. రిటైర్మెంట్ ప్లాన్స్, ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్ పాలసీల వలన వీరి డేటా ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా కంపెనీలు తమ వర్కర్లకు సంబంధించిన మరిన్ని డిటెయి లు సేకరించాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించింది కూడా. కానీ, ఇన్ఫార్మల్ సె కాలోని వర్కర్ల డేటాను సేకరించడంలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాదిలో లోపు ఈ సెక్టార్‌లోని మొత్తం లేబరర్లు, వర్క ర్లడేటాను సేకరించాలని గవర్నమెంట్ టార్గె గా పెట్టుకుంది.

* లావోస్ కు వెళ్లే మార్గంలో చైనాలోని యువాన్ జియాంగ్ నదిపై వంతెన దాటుతున్న రైలు.

ఇక చైనా నుంచి లావోను నేరుగా రైలు.

బీజింగ్: చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తన బెల్ట్ ఆండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్‌) ప్రాజెక్టులో ఒక కీలక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని కున్మంగ్ నుంచి లావోస్ రాజధాని వియంటియాను రైలు మార్గం ప్రారంభ
మైంది. బీఆర్‌లో ఇది తొలి సీమాంతర ప్రాజెక్టు కావడం గమనార్హం. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. లావోస్ ప్రధాని దాంగూన్ సిసోలిత్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు విలువ 600 కోట్ల డాలర్లు. 2016లో నిర్మాణం ప్రారంభమైంది. 1035 కిలోమీటర్ల ఈ రైలు మార్గం కున్మం గను, వియంటియాను కలుపుతుంది. సాధారణంగా లావోస్ రాజధాని నుంచి చైనా సరిహద్దుకు చేరడా నికి రెండు రోజులు పడుతుంది. ఈ రైలుతో ఆ సమయం మూడు గంటలకు పరిమితం కానుంది.

* అద్దె ఇళ్ల నుంచే సైబర్ మోసాలు!

పోలీసుల దృష్టి మళ్లించేందుకు పన్నాగం.

కిరాయికి ఇచ్చే ముందు జాగ్రత్తలు అవసరం.

హైదరాబాద్: మెట్రో నగరాల్లో సొంత ఇల్లు, ప్లాట్లు ఉన్న యజమానులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తు | న్నారు. అపరిచితులకు కిరాయికి ఇచ్చినా, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామన్నా, ప్రముఖ కంపెనీలకు ఒప్పంద ప్రాతిపదికన సేవలు అందిస్తున్నామని చెప్పినా.. వివరాలను సరిచూసుకోవాలని వివరిస్తున్నారు. ఉద్యోగం పేరుతో మోసం చేశారని హైదరాబాద్ కు చెందిన సాయికుమార్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి వివరాలను సేకరించి. బెంగళూరుకు వెళ్లారు. బాధితుడి నుంచి కాజేసిన సొమ్ము గ్రూ టెక్నాల జీతకు వెళ్లిందని తెలుసుకుని ఆ చిరునామాకు వెళ్లగా.. అక్కడ ఒక వైద్యనిపుణుడు ఉన్నారు. ఇక్కడ కంపెనీ ఉండాలి కదా అని ప్రశ్నిం చగా.. ఈ ఇల్లు నాది.. కిరాయికి ఇచ్చాను.. వారు ఖాళీ చేసి వెళ్లారని వివరించారు. పోలీసులు పరిశోధించగా.. వైద్య నిపుణుడి ఇంటి నంబరు మీద 200 కంపెనీలను రిజిస్టర్ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆయనకు తాఖీదులు ఇచ్చి హైదరాబాద్ కు రావాల్సిందిగా సూచించారు.

* డొల్ల కంపెనీలు.. నకిలీ ఏజెన్సీలు

మెట్రో నగరాల్లో సైబర్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారు పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఇటీవల బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లో కార్యకలాపాలు నిర్వహించకుండా కొత్తగా అభివృద్ధి చెందు తున్న కాలనీలు, జనం ఎక్కువగా ఉండే అపార్ట్మెంట్లలో ప్లాట్లు, ఇళ్లు, అద్దెకు తీసుకుంటున్నారు. ఆ చిరునామా తో డొల్ల కంపెనీలు, నకిలీ ఏజెన్సీ లను తెరుస్తున్నారు. వాటికి ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయరు. రుణ యాలతో రూ. 30 వేల కోట్లు కొల్లగొట్టిన చైనీయులు.. దిల్లీలో 29 కంపె నీలు ప్రారంభిస్తే అందులో 12 కంపెనీలు ఒకే చిరునామా పై ఉన్నాయి. మెయిల్ హ్యాకింగ్ ద్వారా మోసం చేస్తున్న సైబర్ నేరస్థుల చిరునామా లన్నీ ముంబయి, చెన్నై, బెంగళూరులోని అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. దిల్లీ లోని కరోల్ బాగ్లో ఉంటున్న సైబర్ నేరస్తుడిని పట్టుకుంటే మాదాపూర్, బేగం పేటలలో కార్యాలయాలున్నాయని తేలింది.

* యజమానులేం చేయాలి?

• ఇల్లు, ఫ్లాట్ కిరాయికి ఇచ్చేటప్పుడు వారి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులు, బ్యాంక్ ఖాతా నకలు ప్రతులు తీసుకోవాలి. మోసం చేసేవారు కచ్చితంగా నకి లీవి తయారు చేస్తారు. అంతర్జాలంలో వాటిని సరిపోల్చుకున్నాకే ప్లాట్, ఇల్లు అద్దెకు ఇవ్వాలి.

• ఇంటర్నెట్ కనెక్షన్, బ్రాడ్ బ్యాండ్ సామర్థ్యం , వినియోగ సమయం తెలుసుకోవాలి. 24 గంటలు ఇంటర్నెట్ వాడుతున్నా.. పనిచేస్తున్నట్లు కనిపిం చినా ఏం చేస్తున్నారని ప్రశ్నించాలి.

• సైబర్ నేరస్టులు ఇల్లు, ఫాట్లలోనే ఎక్కువ సమయం గడిపే అవకాశాలున్నాయి. అల్పాహారం, భోజనాన్ని ఆన్లైన్ డెలివరీ ద్వారా తెప్పించుకుం టారు. ఇలాంటి అంశాలను గమనించి పనిచే స్తున్న కంపెనీ పనివేళల వివరాలు తెలుసుకో వాలి. యజమాని మరోచోట ఉన్నా తరచూ ఇంటిని సందర్శిస్తూ పర్యవేక్షిస్తుండాలి. అవసర మైతే అపార్ట్మెంట్/కాలనీ సొసైటీ సభ్యుల, సహ యజమానుల సహకారం తీసుకోవాలి.

• కాలనీ, అపార్ట్మెంటుకు విధి నిర్వహణలో భాగంగా వచ్చే బీట్ కానిస్టేబుల్, బ్లూకోల్ట్స్ బృందాలతో మాట్లాడాలి. అద్దెకు ఉంటున్న వారిని పిలిచి పోలీస్ అధికారులను పరిచయం చేస్తే మోసం చేసే వారిలో కంగారు కనిపించే అవకాశముంది.

* క్రిప్టో కరెన్సీ కాదు… క్రిప్టో అసెట్

పేరు మార్పునకు ప్రభుత్వ నిర్ణయం!

సెబీ పరిధిలోకి తీసుకురావొచ్చు

దిల్లీ: క్రిప్టో కరెన్సీని ‘క్రిప్టో అసెట్ గా పేరు మార్చడంతో పాటు, మార్కెట్ నియం త్రణాధికార సంస్థ సెబీ పరిధిలోకి దీనిని తీసు కురావాలని మోదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని సమాచారం. అంటే సెబీ దగ్గర నమోదైన ప్లాట్‌ఫాంలు, ఎక్స్చేంజీల ద్వారా
మాత్రమే క్రిప్టో లావాదేవీలు జరగాలి. నెట్ వద్ద నమోదు కావడానికి ప్రస్తుత క్రిప్టో ఎక్స్ఛేంజీలకు గడువు తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇవన్నీ అమల్లోకి రావడానికి వీలుగా ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమా వేశాల్లో ఒక బిల్లును ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అత్యు న్నతాధికారి తెలిపారు. నగదు అక్రమ లావాదేవీల (మనీ లాండరింగ్ ను ఆరికట్టడానికి ఈ బిల్లులో ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యార్డ్ (పీఎమ్ ఎల్పీ) నిబంధనలను సైతం పొందుపరుస్తారని వివరించారు. ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ బిల్లుకు సంబంధం లేకుండా ఇది విడిగా ఉంటుంది. డిజి టల్ కరెన్సీకి, క్రిప్టో కరెన్సీని క్రిప్టో అనెగా వర్గీకరించడానికి మధ్య అంతరం ఉండేందుకు ఇలా చేయనున్నారని విశదీకరించారు.

* ఉల్లంఘిస్తే రూ.5-20 కోట్ల జరిమానా

వివిధ స్థానిక ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అవుతున్న క్రిప్టోకరెన్సీల విలువ భారీగా పడిపోయిన నేపథ్యంలో, క్రిప్టో కరెన్సీలను నిషేధించడం కంటే
వాటిని నియంత్రించడం మేలన్న నిర్ణయానికి వచ్చారు. ‘అన్ని క్రిప్టో ఎక్స్చేంజీలు సెబీ నియంత్రణ పరిధిలోకి వస్తాయి. ఏదైనా ఉల్లంఘన జరిగితే నిర్వాహకులకు రూ.5-20 కోట్ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉండొచ్చని ఆ అధికారి వివరించారు.

సెబీకి ఇష్టమేనా?

సెబీ కిందకు క్రిప్టో ప్లాట్ ఫాంలను తీసుకురావడం వల్ల మార్కెట్లో సామ ర్థ్యం కలిగిన సంస్థలే మనుగడ సాగిస్తాయని అంచనా. క్రిప్టో ప్లాట్‌ఫాంల రూపంలో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్టవేసినట్లు అవుతుంది. అయితే సెబీలోని కొన్ని వర్గాల సమాచారం ప్రకారం. క్రిప్టోను నియంత్రించడానికి తొలుత సెబీ పెద్ద ఆసక్తి చూపలేదు. ఊహాజనితమైన క్రిప్టోల్లో ఎటువంటి ఆస్తులు లేకపోవడమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో ప్రతీ లావాదేవీ, ప్రతి వాలెటు ఒక కేంద్రీకృత డీమ్యాట్ తరహా స్టోర్‌లో ఉంచాలని భావిస్తోంది. కాయిన్ ఓనర్‌షిపన్ను రియల్ టైమ్ లో నిర్వహించడానికి ఒక ప్రత్యేక డేటాబేసను సృష్టించడానికి ఇది అత్యంత అవసరమని ఆ అధికారి వివరించారు.