DailyDose

TNI నేటి తాజా వార్తలు 5-Dec-2021

TNI నేటి తాజా వార్తలు 5-Dec-2021

* పాత దీపాలను పడవేయకండి.
దీపాలు పాతవి అయిపోతే చాలా మంది వాటిని మార్చేస్తారు, ఎపుడో ఒకసారి దీపాలు పెట్టె వాళ్ళు ఎలా చేసుకున్న పర్వాలేదు కానీ నిత్యం దీపారాధన చేసుకునే ఆడవాళ్లు ఆ పాత దీపాలను మార్చుకోకూడదు మరి పాతావి దేవుడి ముందు బాగలేదు అనుకుంటే అవి తులసి కోట దగ్గర అయినా పెట్టండి లేదా కాలం చేసిన పెద్దవారి ముందు అయినా పెట్టండి కానీ పాతవి అయిపోయింది అని మూలన పెట్టకండి, మార్చకండి.

ఎందుకంటే మన కుటుంబంలో మనుషులుగా మనతో దీపాలకు కూడా ఒక బంధం ఉంటుంది, అవి బొమ్మలు కాదు ప్రత్యక్షంగా దైవస్వరూపాలు, మన సంతోషాలు కష్టాలు, కనీళ్లు, బాధ్యతలు పంచుకున్న మన ఆప్తులతో సమానం, మనము ఒక కష్టాన్ని భగవంతుడు కి చెప్పుకుంటే మన పూజ గదిలో దీపాలు కూడా భగవంతుడు ని ప్రార్తిస్థాయి, మనము సంతోషం గా దీపం పెట్టి పూజ చేసి నప్పుడు భగవంతుడు కి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి.

దీపం లో నూనె అయిపోతే కొండెక్కి పోతుంది అనుకుంటారు ఆ ప్రమిద చివరి భాగంలో గూడు కట్టిన మసిలో దీపం ఇంటి యజమాని వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలుకి తోడుగా ఉంటుంది, ఆమె భర్త బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరాలి అని భగవంతుడుని ప్రతిస్తూ ఉంటాయి అంటారు. అందుకే చాలా కాలం గా పూజించిన దీపాలకు కూడా చాలా విలువ ఉంటుంది మహిమ ఉంటుంది. ప్రాణం వుంటుంది. పాత దీపాలు అనుకోకుండా శుభ్రంగా ఉంచి వాడుకోండి.

* ప్రభాస్‌ కోసం దీపిక ఆగమనం

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతానికి ‘ప్రాజెక్ట్‌ కె’గా పిలుస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. కథానాయికగా బాలీవుడ్‌ స్టార్‌ నాయిక దీపిక పదుకొణెని ఎంచుకున్న సంగతి తెలిసిందే. శనివారం ఆమె సెట్లోకి అడుగుపెట్టారు. ‘వెల్‌ కమ్‌ క్వీన్‌’ అంటూ చిత్రబృందం సోషల్‌ మీడియా ద్వారా ఆహ్వానం పలికింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ కీలకమైన షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. ఇందులో అమితాబ్‌బచ్చన్‌ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

కొత్త అధ్యాయానికి శ్రీకారం

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి ‘ప్రాజెక్ట్‌-కె’ అనే వర్కింగ్‌ టైటిల్‌ను నిర్ణయించారు. దీపికా పడుకోన్‌ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. తాజాగా ఈ సినిమా సెట్‌లోకి దీపికా పడుకోన్‌ అడుగుపెట్టింది. ఆమెకు చిత్రబృందం సంప్రదాయరీతిలో అపూర్వస్వాగతం పలికింది. కంచిపట్టు చీర, పసుపుకుంకుమ, గాజులు, పుష్పాలను ఓ అందమైన పెట్టెలో పొందుపరిచి ఆమెకు కానుకగా అందించారు. ఈ ఫొటోను నిర్మాణ సంస్థ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ప్రపంచాన్ని ఏలుతున్న దక్షిణాది ముద్దుబిడ్డ, దేశం గర్వించే రాజకుమారి, ఓ అపురూప సంపద అయినటువంటి దీపికా పడుకోన్‌కు స్వాగతం. మనమంతా కలిసి ప్రపంచాన్ని జయిద్దాం’ అంటూ నిర్మాణ సంస్థ దీపికా ఆగమనం గురించి సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీపికా పడుకోన్‌ నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నన్ను భరించడం కష్టం

తొలి సినిమా ‘రొమాంటిక్‌’తో ఆకట్టుకుంది కేతిక శర్మ. ఇప్పుడు రెండో సినిమా కూడా పూర్తి చేసింది. నాగశౌర్య నటించిన ‘లక్ష్య’లో తనే కథానాయిక. సంతోష్‌ జాగర్లమూడి దర్శకుడు. ఈనెల 10న విడుదల అవుతోంది. ఈసందర్భంగా కేతిక మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నా పేరు రితిక. మనసుకి ఏమనిపిస్తే అది చేస్తుంది. తొలి సినిమా ‘రొమాంటిక్‌’తో పోలిస్తే. చాలా విభిన్నమైన పాత్ర. ‘రొమాంటిక్‌’ విడుదలైన నెలరోజులలోపే ‘లక్ష్య’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఇది స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే సినిమా. నాకు కూడా క్రీడలంటే చాలా ఆసక్తి. స్టేల్‌ లెవల్‌ స్విమ్మర్‌ని. మా అమ్మగారు కూడా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే కథలంటే నాకు ఇష్టం. భవిష్యత్తులో స్పోర్ట్స్‌ డ్రామా వస్తే తప్పకుండా నటిస్తా. ఈ సినిమాలో నేను పోషించిన పాత్రకూ. నా నిజ జీవితానికీ దగ్గర పోలికలు ఉంటాయి. రితిక లా నేను కూడా ముక్కుసూటిగా మాట్లాడతా. నన్ను భరించడం చాలా కష్టం. ప్రస్తుతం వైష్ణవ్‌తేజ్‌తో ఓసినిమా చేస్తున్నా. కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథ అది. నా పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంద’’ని చెప్పుకొచ్చింది.

* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 30,979 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా. కొత్తగా 154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనాతో నిన్న గుంటూరులో ఇద్దరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 177 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,122 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

* ఒకట్రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం డీహెచ్ శ్రీనివాసరావు

హైదరాబాద్ : ఒకట్రెండు నెలల్లో భారత్ లో, వచ్చే ఏడాది జనవరి 15 తర్వాత తెలంగాణలోనూ కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. వాటిలో 75 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయన్నారు. కానీ అక్కడ కేసులు పెరిగినా ఆస్పత్రులో చేరికలు, మరణాలు పెరగడం లేదని చెప్పారు.

విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ విమానాశ్రయంలో పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 900 మందికి పైగా విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్నారని. వారిలో 13మందికి కొవిడ్‌ నిర్ధరణ అయిందన్నారు. వారిని క్వారంటైన్ లో ఉంచామని.. వారికి ఒమిక్రాన్ సోకిందా లేదా అనే విషయం ఒకట్రెండు రోజుల్లో తేలుతుందని చెప్పారు. ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడం లేదని అన్నారు. వైరస్‌ సోకితే తీవ్ర ఒళ్లునొప్పులు, తలనొప్పి, నీరసం ఉంటాయన్నారు.

కొవిడ్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దాస్తున్నామన్న వార్తలో వాస్తవం లేదని తెలిపారు. తప్పుడు వార్తలతో వైద్యారోగ్యశాఖ మనోస్థైర్యం దెబ్బతింటుందని. కొవిడ్‌ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమని అన్నారు. ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేశామని చెప్పారు. ఇప్పటివరకు 92 శాతం మందికి మొదటి డోసు పూర్తి కాగా. 48 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయన్నారు. ఈ నెలాఖరు లోపు 100 శాతం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు.

ఇక ఒకట్రెండు నెలల్లో భారత్‌లోనూ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 15 తర్వాత రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఇక ఫిబ్రవరిలో భారీగా కేసులు నమోదు కావొచ్చన్నారు. కావున ప్రజలంతా తప్పకుండా నిబంధనలు పాటించాలన్నారు. పండుగల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు అయితే రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌లు ఉండవని స్పష్టం చేశారు.

* బాలయ్య నటించిన అఖండ సినిమా రికార్డులు నెలకొల్పుతూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ అభిమానులు ఆనంద ఉత్సవాల్లో మునిగి తేలుతున్నారు అమెరికాలోని చికాగో నగరంలో బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలు నిర్వహించారు Bowl O Biryani రెస్టారెంట్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు చిత్ర దర్శకుడు బోయపాటి తో బాలయ్య అభిమానులు ఫోన్లో ముచ్చటించారు హేమ కానూరు తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

* అమరావతి:

ఈనెల 10న బెంజి సర్కిల్‌ రెండో పైవంతెనను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు.