DailyDose

నేడు విజయవాడలో తానా భారీ సేవా శిబిరం

నేడు విజయవాడలో  తానా భారీ సేవా శిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో సోమవారం నాడు విజయవాడ ఐటిఐ కళాశాల లో భారీ సేవా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు పేదలకు రగ్గులు చీరల పంపిణీ సిపిఆర్ శిక్షణ అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తానా ఫౌండేషన్ సభ్యుడు పుట్టగుంట సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరానికి తానా ప్రస్తుత అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తదుపరి అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ తదితరులు హాజరవుతున్నారు.