సీనియర్ పాత్రికేయులు, హ్యూమనిస్ట్ ఉద్యమ ప్రముఖులు, రచయిత నరిశెట్టి ఇన్నయ్య సతీమణి వెనిగళ్ల కోమల ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అన్వర్-అల్-ఉలుం కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె తదనంతరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా సేవలందించారు. తస్లీమ నస్రీన్ బెంగాలీ నవల శోధ్‌ను తెలుగులో చెల్లుకు చెల్లు పేరిట అనువదించారు. మేరీల్యాండ్‌లో ఆమె కుమార్తె డా.నరిశెట్టి నవీన వద్ద నివసిస్తున్న ఇన్నయ్య-కోమల దంపతులు డీసీ-వర్జీనియా-మేరీల్యాండ్ రాష్ట్రాల్లో సుపరిచితులు. వీరి కుమారుడు నరిశెట్టి రాజు న్యూస్ కార్పోరేషన్ మాజీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్‌గా, గిజ్మోడో సంస్థకు మాజీ CEOగా, ప్రఖ్యాత పాత్రికేయులుగా గుర్తింపు పొందారు.
ప్రముఖ రచయత్రి వెనిగళ్ల కోమల మృతి
Related tags :