ప్రభాస్ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘ప్రాజెక్ట్-కె’ అనే వర్కింగ్ టైటిల్‌ను నిర్ణయించారు. దీపికా పడుకోన్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. తాజాగా ఈ సినిమా సెట్‌లోకి దీపికా పడుకోన్ అడుగుపెట్టింది. ఆమెకు చిత్రబృందం సంప్రదాయరీతిలో అపూర్వస్వాగతం పలికింది. కంచిపట్టు చీర, పసుపుకుంకుమ, గాజులు, పుష్పాలను ఓ అందమైన పెట్టెలో పొందుపరిచి ఆమెకు కానుకగా అందించారు. ఈ ఫొటోను నిర్మాణ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ‘ప్రపంచాన్ని ఏలుతున్న దక్షిణాది ముద్దుబిడ్డ, దేశం గర్వించే రాజకుమారి, ఓ అపురూప సంపద అయినటువంటి దీపికా పడుకోన్‌కు స్వాగతం. మనమంతా కలిసి ప్రపంచాన్ని జయిద్దాం’ అంటూ నిర్మాణ సంస్థ దీపికా ఆగమనం గురించి సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీపికా పడుకోన్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రభాస్ ProjectKలోకి ప్రవేశించిన దీపికా
Related tags :