సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ తేల్చి చెప్పింది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. జగన్ హోదా పెరిగినందున సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొంది. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని సీబీఐ తెలిపింది. హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని వెల్లడించింది.