* పిఆర్సీ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించినట్లు ఎపి ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసులు స్పష్టం చేశారు.సోమవారం శ్రీకాకుళం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనమాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తమ డిమాండ్స్ నివేదించినా స్పందించడం లేదన్నారు.2018 సంవత్సరం నుండి పిఆర్సి అమలు చేయలేదని ఇప్పటి వరకు పిఆర్సీ రిపోర్టులు బయటపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.సిపియస్ ను రద్దు చేస్తామని పాదయాత్రలో సియం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయలేదన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.తమ డిమాండ్ ల పరిష్కారానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చిందన్నారు.ఉద్యమంలో భాగంగా ఉద్యోగుల్ని ఉత్తేజ పరచడానికి కొన్ని వ్యాఖ్యలు చేశామని వాటిని కొన్ని రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయని తాము ఏ పార్టీకి తోత్తులం కాదని ఉద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తామని అని ఆయన స్పష్టం చేశారు. బండి శ్రీనివాసులు (ఎపి.ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు).
* నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిపోయి అవినీతి రాజ్యమేలుతుంటే చూస్తూ ఉండిపోతూ హనీమూన్ పెళ్లి కొడుకులా వ్యవహరిస్తున్న నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు పై టిడిపి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నిప్పులు చెరిగారు.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామంలో ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడును గ్రామ ప్రజలు తమ సమస్యలను ఆయన ముందుచి ఏకరువు పెట్టారు. దీనిపై సహనం కోల్పోయిన శ్రీనివాస్ నాయుడు గత టీడీపీ పాలనలో ఉన్న ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు 100 కోట్లకు అవినీతి పాల్పడ్డాడని అతనిని ప్రశ్నించడం మానేసి తనను ఎందుకు అడుగుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఈరోజు ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీని నాయుడు తండ్రి చాటు బిడ్డ అని ఈ విషయం నియోజకవర్గంలో చిన్న పిల్ల వాడిని అడిగిన చెపుతారు అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ప్రజాసేవ చెయ్యడానికి కాదు,రాజకీయాల్లోకి వచ్చింది హనీమూన్ కోసంమే అని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గంలో నాటు సారా డంపులు మీ అధికార పార్టీ కనుసన్నల్లోనే జరుగుతుంది. అవి మీరే పట్టిస్తారు,మళ్ళీ మీరే సెటిల్ చేస్తారు. నియోజకవర్గంలో ఎక్కడ లేఅవుట్ వేయాలన్న ఎమ్మెల్యే ను సంప్రదించాలి, వారికి సమర్పించి వారి అనుమతి తీసుకున్న తర్వాతనే లేఅవుట్స్ వేయాలి అనడం ఎంతవరకు సమంజసం. నా సొంత ఇబ్బందుల వల్లే గానీ నేను బయటకు రాకపోవడం,మీకు భయపడి కాదు. ఈ విషయం అధినాయకుడు చంద్రబాబు కూడా చెప్పాను అని అన్నారు.
మాట్లాడితే 100 కోట్ల ఇసుకలో అవినీతి అనడం కాదు,అధికారంలో ఉన్నది మీరే కదా నిరూపించండి. నియోజకవర్గంలో ఏ వ్యాపారం ప్రారంభించిన మీ చేతుల మీదుగానే ప్రారంభించాలా,లేకపోతే అవి రోడ్ డివైడ్ లో కొట్టేస్తారా. నిడదవోలు నియోజకవర్గంలో మా పార్టీ చేసిన అభివృద్ధిపై,మీ పార్టీ చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం. సొంత పార్టీ కార్యకర్తలలో అసహనం ఇది మీరు సాధించిన అభివృద్ధి.
రాజకీయ నాయకులను మీటింగ్ లలో కొన్ని సందర్భాల్లో ప్రజలు అభివృద్ధి పై ప్రశ్నిస్తారు. దానికి మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి తప్ప గత ఎమ్మెల్యే ని ఇలా ఆడిగారా అని తప్పించుకోవడం కేవలం భాద్యతారాహిత్యం మాత్రమే. నియోజకవర్గంలో తమ పాలనలో అటువంటివి జరగలేదని నియోజకవర్గ అభివృద్ధినీ మాత్రమే ఆకాంక్షించామని ఈ సందర్భంగా శేషారావు అన్నారు.
* న్యూఢిల్లీ
– రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసులను వీలైనంత త్వరగా తేల్చండిః లోక్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ.వీ. మిథున్‌రెడ్డి డిమాండ్.
– రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై లోక్ సభలో వైయస్ఆర్సీపీ ఎంపీల నిరసన.
– రఘురామ వ్యాఖ్యలపై ఘూటుగా స్పందించిన మిధున్ రెడ్డి.
– బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు దోచిన స్కాం స్టర్ రఘురామకృష్ణరాజు.
– భారత్ థర్మల్ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
లోక్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ.వీ. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే.
‘సభలో నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరి కాదు. రఘురామకృష్ణరాజు రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. వాస్తవానికి రఘురామకృష్ణరాజుపై రెండు సీబీఐ కేసులు నమోదై ఉన్నాయి. ఆయన బ్యాంకులను మోసం చేశాడు. వాటి నుంచి బయట పడడం కోసం కేంద్రంలోని అధికార(బీజేపీ) పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు మా పార్టీ నుంచి ఎంపీగా గెల్చాడు. ఈ విషయాని ప్రతి ఒక్కరూ గమనించాలి. బ్యాంకులను మోసం చేశాడు కాబట్టి, ఆ కేసుల నుంచి బయట పడడానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల నేను మీ (స్పీకర్ ఛైర్) ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రఘురామకృష్ణరాజు మీద ఉన్న కేసులను వీలైనంత త్వరగా తేల్చండి. భారత్ థర్మల్ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయండి’.
* లోక్ సభలో రఘురామకృష్ణరాజు, మిథున్ రెడ్డిల మధ్య మాటల తూటాలు! రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారన్న రఘురాజు రఘురాజుపై సీబీఐ కేసులు ఉన్నాయన్న మిథున్ రెడ్డి ముందు జగన్ పై ఉన్న సీబీఐ కేసులను తేల్చాలన్న రఘురాజు
ఈరోజు లోక్ సభలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. జీరో అవర్ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. రైతులు గాంధేయ పద్ధతిలో పాదయాత్ర చేస్తున్నారని. వారి పాదయాత్రకు ఆటంకాలు సృష్టించడం సరికాదని అన్నారు.
పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ. వారిని అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల పట్ల ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రఘురాజు ప్రసంగాన్ని వైసీపీ ఎంపీలు అడ్డుకునేందుకు యత్నించారు. ప్రసంగం మధ్యలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ. రఘురాజుపై సీబీఐ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడేందుకు బీజేపీలో చేరేందుకు ఆయన తహతహలాడుతున్నారని చెప్పారు. రఘురాజు సీబీఐ కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రఘురాజు కల్పించుకుంటూ. తనపై రెండు సీబీఐ కేసులు మాత్రమే ఉన్నాయని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వంద సీబీఐ కేసులు ఉన్నాయని చెప్పారు. జగన్ పై ఉన్న సీబీఐ కేసులను ముందు తేల్చాలని డిమాండ్ చేశారు.
* విజయవాడ:
7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ శంఖారావం.
★ ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించనున్నారు.
★ ఉద్యోగుల సమస్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు.
★ ఉద్యోగుల సమస్యలు సహా ఆందోళనపై కార్యాచరణ వివరిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యా సాగర్ మాట్లాడుతూ.
★ 13లక్షల ఉద్యోగులను సమాయత్త పరిచేందుకు కార్యక్రమాలను చేపట్టామన్నారు.
★ 2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదన్నారు.
★ ఇప్పటి వరకు పీఆర్సీ రిపోర్టు బయటపెట్టలేదని, 7 పెండింగ్ డీఏలను నిలుపుదల చేసిన రాష్ట్రం ఏదీ లేదన్నారు.
★ డీఏ బకాయులను ఇవ్వని ఏకైక సర్కార్ ఎపీ ప్రభుత్వమేనని ఆరోపించారు.
★ సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు.
★ అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఆందోళనను కొనసాగిస్తామని విద్యాసాగర్ స్పష్టం చేశారు.
* అమరావతి/నెల్లూరు జిల్లా
తిరుపతి సభకు అనుమతి ఇవ్వకపోతే.. హైకోర్టుకు వెళ్తాం
అమరావతి రైతులు ఈనెల 17న ర్వహించబోయే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అమరావతి ఐక్య పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి తెలిపారు.
★ ఈనెల 17న తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించబోయే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అమరావతి ఐక్య పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి తెలిపారు.
★ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ ఇస్తే.. ఆంక్షలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రత్యుత్తరం పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
★ పాదయాత్రలో 42 కేసులు నమోదైనందున.. ఎందుకు అనుమతి ఇవ్వాలని ప్రశ్నించినట్లు శివారెడ్డి వెల్లడించారు.
★ పాదయాత్రలో నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని.. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లఘించలేదని వివరించారు.
★ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారానే అనుమతి తెచ్చుకుంటామని శివారెడ్డి స్పష్టం చేశారు.
* శ్రీకాకుళం జిల్లా
బండి శ్రీనివాసులు… ఏపి ఎన్జీవో రాష్ట్ర అద్యక్షులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 71 డిమాండ్లు ప్రభుత్వానికి ఇచ్చాం నాలుగు సంవత్సరాలైనా పి ఆర్ సి లేదు, పి ఆర్ సి రిపోర్ట్ ఇవ్వమని అడిగాం అయినా ప్రభుత్వం ఇవ్వలేదు పెండింగ్ లో ఉన్న 16లవేల కోట్ల రూపాయిల ఆర్థికపరమైన డిమాండ్లు నేరవెర్చాలని కోరాం మేం దాచుకున్న డబ్బులు సైతం చెల్లింపులు జరపడం లేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే కార్యచరణ ప్రకటించాం.
పి ఆర్ సి రిపోర్ట్ బయటపెడితేనే.. దానిలోని సమస్యలు తెలుస్తాయి.
వారంలో పి ఆర్ సి ఇస్తామని సి ఏం చెప్పారు, కానీ.. మా ఉద్యమం రేపటి నుండి ప్రారంభిస్తాం.
ఉద్యమంలో బాగంగా… ఉద్యోగుల్ని ఉత్తేజ పరచడానికి కొన్ని వ్యాఖ్యలు చేసాం.
దాన్ని బూతద్దంలో చూపి.. ప్రభుత్వానికి దూరం చేసి… వారి పార్టీ కోసం ప్రచారం చేసుకుంటున్నారు.
కొన్ని పత్రికలు తెలుగుదేశం పార్టీ వైపు కోమ్ముకోస్తున్నాయి.
ఉద్యోగులు ఏవరికి ,ఏ పార్టీకి తోత్తుగా వ్యవహరించం … ఏముఖ్యమంత్రితోనైనా సత్సంబంధాలు తోనే నడుస్తాం.
మాకు ఉద్యోగుల సమస్యలే ముఖ్యం.
నా వ్యాఖ్య ల్లో ఏవిధమైన రాజకీయ కోణం లేదు… నేను ఏవరి తో త్తును కాదు మాకు పార్టీలు అంటగట్టోద్దు.
సమస్యలు పరిష్కరిస్తే మేం ప్రకటించిన కార్యచరణ ప్రకారం ముందుకు వెల్తాం.
ప్రభుత్వ పెద్దగా ఉన్న ముఖ్యమంత్రిని అడగకపోతే ఇంకేవరిని అడుగుతాం.
పార్టీల మద్య ఏవైనా రాజకీయాలు ఉంటే మీరు మీరు చూసుకోండి మాకు దయచేసి అంటగట్టవద్దు.
* మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ అసైన్డ్ భూములను కబ్జా చేసిందని మెదక్ కలెక్టర్ అన్నారు. 70.33 ఎకరాలు కబ్జా చేసినట్లు సర్వేలో తేలిందని చెప్పారు. ఈటల భూముల అంశంపై కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్లు తేలింది. అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్ భూముల కబ్జా జరిగింది. జమునా హేచరీస్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసింది. అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు’’ అని కలెక్టర్ చెప్పారు.
* ఏపీలో పోలీసులకు సవాల్‍గా మారిన చెడ్డీ గ్యాంగ్.
తాడేపల్లిలో సీఎం నివాసం సమీపంలోనూ చోరీలు.
ప్రజాప్రతినిధుల విల్లాలలో చెడ్డి గ్యాంగ్ దొంగతనం.
ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి విల్లాస్‍లో చోరీ.
ఇటీవల విజయవాడ శివదుర్గ ఎన్‍క్లెవ్‍లోని ఓ అపార్ట్ మెంట్‍లో చోరీ.
* తిరుపతి… బ్రేకింగ్.
? పురిటి బిడ్డను రోడ్డుపై పడేసిన కర్కోటకులు.
?పూతలపట్టు నాయుడుపేట ప్రధాన రహదారిలోని పేరూరు కట్ట వద్ద ఘటన .
? సంఘటనా స్థలానికి చేరుకున్న ముత్యాల రెడ్డి పల్లి పోలీసులు.
? పురిటి బిడ్డ మృతి చెందడంతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు.
? కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎంఆర్ పల్లి ఎస్ఐ దీపిక.